Monday, April 29, 2024
- Advertisement -

రజనీకాంత్ అల్లుడి సినిమా.. ఊహించని ట్విస్టుతో విడుదల ఆగింది!

- Advertisement -

వాస్తవానికి ఈ సినిమాకు వీఐపీ -2 అని మొదట నామకరణం చేశారు. తెలుగులో ‘రఘువరన్ బీటెక్’ కు సీక్వెల్ గా ఈ సినిమా రూపొందుతోందని ప్రకటించారు. అయితే… విడుదల సమయానికి పేరు మార్చారు. ‘నవ మన్మథుడు’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.

అయితే… ఆ టైటిలే ఆ సినిమా విడుదలకు ప్రతిబంధకంగా మారడం ఇక్కడ ట్విస్టు. ఈ సినిమా నిన్నటి శుక్రవారం విడుదల కావాల్సింది. అయితే.. ఈ సినిమా టైటిల్ పై  రేగిన వివాదం సినిమా విడుదలను ఆపేసింది.ఈ పేరుతో ఫిలించాంబర్ లో ఒక సినిమా రిజిస్టర్ అయ్యిందట. తాము రిజిస్టర్ చేసిన పేరుతో ఈ సినిమాను ఎలా విడుదల చేస్తారు?

అంటూ..ఒక నిర్మాత ఫిర్యాదు చేశాడు. ఈ వివాదం లోలోనే కొనసాగి.. చివరికి ఈసినిమా విడుదలకు అడ్డుగా మారింది. దీంతో శుక్రవారం ఈ సినిమా సరిగా విడుదల కాలేదు. ఒకవైపు ప్రమోషన్ చేసి.. సినిమా విడుదల అని ప్రకటించి.. చివరకు మాత్రం ఇబ్బంది పడ్డారు. అయితే ఎట్టకేలకూ.. శుక్రవారం సాయంత్రానికి సినిమా విడుదల అయ్యింది.

అయితే అప్పటికే ఈ సినిమాపై ఏమైనా ఆసక్తి నెలకొన్నా.. అది కాస్తా జావగారిపోయింది. తమిళంలో మాత్రం ఈ సినిమా యధాతథంగా విడుదలై పర్వాలేదనిపించుకున్నట్టుగా తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -