Sunday, May 12, 2024
- Advertisement -

మ‌హేశ్‌తో చేయాల్సిన సినిమా అఖిల్‌తో చేస్తున్నాడా..?

- Advertisement -

టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ ద‌ర్శ‌కుల‌లో సుకుమార్ ఒక‌రు. తీసింది త‌క్కువ సినిమాలే అయిన‌ప్ప‌టికి మంచి పేరు తెచ్చుకున్నాడు సుకుమార్‌. ఆయ‌న తీసిన సినిమాల‌లో ఎక్కువుగా ఫ్లాప్‌లే ఉండ‌టం విశేషం సుకుమార్ ఫ్లాప్ సినిమాల‌కు కూడా చాలా మంచి పేరు వ‌స్తోంది. మ‌హేశ్‌తో తీసిన 1 నేనొక్కిడినే సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఫ్లాప్‌గా నిలిచిన‌ప్ప‌టికి ఈ సినిమా సుకుమార్‌కు మంచి పేరే తెచ్చిపెట్టింది. గ‌త ఏడాది రామ్ చ‌ర‌ణ్‌తో తీసిన రంగ‌స్థలం సినిమా ఎంత‌టి విజ‌యాన్ని నమోదు చేసిందో అంద‌రికి తెలిసిందే. సుకుమార్ త‌న త‌రువాత సినిమాను మ‌హేశ్ బాబుతో ఎనౌన్స్ చేశాడు. సినిమా క‌థ కూడా రెడీ అయింది , షూటింగ్‌కు వెళ్ల‌డమే ఆల‌స్యం అనుకున్నారు. కాని క‌థ సిద్థం కాక‌పోవ‌డంతో మ‌హేశ్ ఈ సినిమాను వాయిదా వేశాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి.

ఈ లోపు మ‌హేశ్ ఎఫ్ 2 దర్శ‌కుడు అనిల్ రావిపూడితో ఓ సినిమాను చేయ‌డానికి స‌న్నాహాలు చేసుకుంటున్నాడ‌ని స‌మాచారం. అయితే మ‌హేశ్ కోసం రెడీ చేసుకున్న క‌థ‌తో అఖిల్‌తో సినిమా చేయ‌డానికి సుకుమార్ రెడీ అయ్యాడ‌ని ఇండ‌స్ట్రీలో గుస గుస‌లు వినిపిస్తున్నాయి. సుకుమార్ గ‌తంలో నాగ‌చైత‌న్య‌తో 100% ల‌వ్ సినిమాను చేశాడు. ఈ సినిమా చైతుకి సూప‌ర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు అఖిల్‌కు కూడా సుకుమార్ హిట్ ఇస్తాడ‌ని అంటున్నారు అక్కినేని అభిమానులు. అఖిల్ – సుకుమార్ క‌ల‌యిక‌లో రూపొంద‌బోయే చిత్రాన్ని అన్న‌పూర్ణ స్టూడియోస్‌తో పాటు, మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించ‌బోతున్న‌ట్టు తెలిసింది. పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే తెలియ‌నున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -