Sunday, May 5, 2024
- Advertisement -

మోహ‌న్ బాబు కార‌ణంగా ఆత్మ‌హ‌త్య చేసుకున్న సీరియ‌ల్ న‌టి

- Advertisement -

ఈ మ‌ధ్య న‌టీ,న‌టులు ఆత్మ‌హ‌త్య‌లు ఎక్కువైయ్యాయి. ఇటీవ‌లే తెలుగు బుల్లితెర న‌టి ఝాన్సీ త‌న ఫ్లాట్‌లో ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఝాన్సీ ఆత్మ‌హ‌త్య‌కు కారణం ఆమె ప్రియుడు సూర్య తేజ వేధింపులే అని తెలుస్తోంది. తాజాగా మ‌రోన‌టి ఆత్మ‌హ‌త్య చేసుకుంది. తమిళ ఇండ‌స్ట్రీకి చెందిన య‌షిక శుక్ర‌వారం ఉద‌యం ఆత్యహ‌త్య చేసుకుంది. యషిక అసలు పేరు మేరీ షీలా జేబరాని. యషిక త‌మిళ సీరియ‌ల్స్‌లో న‌టిస్తు మంచి పేరు తెచ్చుకుంది. కెరీర్ ఉన్న‌త ద‌శ‌లో ఉన్న‌ప్పుడే ఆమె ఇలా ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డంపై చాలామందిని క‌లిచివేస్తోంది. అయితే ఆమె మ‌ర‌ణానికి ఆమె ప్రియుడే అని తెలుస్తోంది. య‌షిక గ‌త కొంత‌కాలంగా మోహ‌న్ బాబు అనే వ్య‌క్తితో ప్రేమ‌లో ఉంద‌ని స‌మాచారం. మోహన్ బాబుతో య‌షిక‌ సహజీవనం కూడా చేసిన‌ట్లు స‌మాచారం అందుతోంది.కొంతకాలం పాటు బాగానే ఉన్న వీరిద్దరి మధ్య నాలుగు రోజుల క్రితం గొడవ జరిగినట్లు తెలుస్తోంది.

ఇద్దరి మధ్య ఏర్పడిన అభిప్రాయ బేధాల కారణంగా ఒకరినొకరు దూషించుకున్నారు. దీని కార‌ణంగానే వీరిద్ద‌రు వేరు వేరుగా ఉంటున్నారు. తీవ్ర మనస్తాపానికి గురైన యషిక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. తాను ఆత్మ‌హ‌త్య చేసుకుంటాన‌ని త‌ల్లికి మెసేజ్ చేసి మ‌రి ఆత్మ‌హ‌త్య చేసుకుంది య‌షిక‌. ఆ మెసేజ్‌లో త‌న చావుకు ప్రియుడు మోహన్ బాబు కార‌ణం అని య‌షిక‌.తనను పెళ్లి చేసుకోకుండా టార్చర్ పెట్టిన మోహన్ బాబు కారణంగానే సూసైడ్ చేసుకుంటున్నానని యషిక మెసేజ్ లో తెలిపింది. మోహన్ బాబు మీద పోలీసులు కేసు న‌మోదు చేశారు. ప్ర‌స్తుతం అత‌ను ప‌రారీలో ఉన్న‌ట్లు స‌మాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -