Saturday, May 18, 2024
- Advertisement -

నీహారిక తో హ్యాపీ వెడ్డింగ్

- Advertisement -

మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నీహారిక పెళ్లి అంటు.. ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలను నాగబాబు ఖండించి.. అందులో ఎలాంటి నిజాలు లేవని తెల్చేశాడు. అయితే.. ఇప్పుడు అసలు సంగతికి వస్తే.. హ్యాపీ వెడ్డింగ్.. ఇది రియల్ లైఫ్ లో కాదు.. రీల్ లైఫ్ లో.

నీహారిక హీరోయిన్ నటించబోతున్న లేటెస్ట్ సినిమా పేరు హ్యాపీ వెడ్డింగ్. ఒక మనసు సినిమా ద్వారా హీరోయిన్ గా మారిన నీహారికకు.. ఆ సినిమా పెద్ద హిట్ ఇవ్వలేకపోయింది. గత ఏడాది రిలీజ్ అయిన ఈ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత ఏడాది గ్యాప్ తీసుకున్న నీహారిక ఇప్పుడు సుమంత్ అశ్విన్ హీరోగా.. రూపొందనున్న హ్యాపీ వెడ్డింగ్ సినిమాలో హీరోయిన్ గా నటించబోతుందని అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. ప్రభాస్ ఫ్రెండ్స్ బ్యానర్ అయిన యూవీ క్రియేషన్స్ సమర్పణలో.. పాకెట్ సినిమా నిర్మాణంలో ‘హ్యాపీ వెడ్డింగ్’ అనే టైటిల్ పై రూపొందనున్న సినిమాలో సుమంత్ అశ్విన్-నీహారిక జంటగా నటించనున్నారు.

ఈ సినిమాకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనుండగా.. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో నరేష్, మురళీ శర్మ, పవిత్రా లోకేష్.. కీలక పాత్రలో నటించనున్నారు. అక్టోబర్ 4 నుంచి హ్యాపీ వెడ్డింగ్ షూటింగ్ ప్రారంభం కానుంది. రొమాంటిక్ జోనర్ లో.. ఫ్యామిలీ ఎంటర్టెయినర్ గా ఈ సినిమా ఉంటుందని నిర్మాతలు చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -