Sunday, May 5, 2024
- Advertisement -

ఉదయభానుకు.. కేసీఆర్ ఏం సాయం చేశారో తెలుసా..?

- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనను అడిగిన అందరికీ సాయం చేస్తుంటారు. అయితే.. కొన్ని విషయాలు ఆయనకు తెలియకుండానే.. ఇతరులకు హెల్ప్ అయిపోతుంటారు. రీసెంట్ గా బ్యూటిఫుల్ యాంకర్ ఉదయభాను విషయంలో ఇదే జరిగింది. అనుకోకుండానే ఉదయభానుకు.. ఆమె కెరీర్ కు బోలెడంత హెల్ప్ చేసేశారు కేసీఆర్. గత కొన్నెళ్లుగా ఉదయభాను యాంకర్ కెరీర్ కి దూరంగా ఉన్న విషయం తెలిసిందే.

గతంలో సినిమాల్లో ను నటించిన ఉదయ భాను.. తల్లి కావడంతో.. బుల్లితెరకు.. వెండి తెరకు దూరంగా ఉంది. రీసెంట్ గానే రీ ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఇప్పుడు వరస అవకశాలు అందుకుంటుంది. రావడంతోనే అందరిలోనూ ఆసక్తి కలుగచేసేయడానికి కారణం కేసీఆర్ అంటే ఆశ్చర్యం ఏమీ లేదు. ప్రస్తుతం తెలంగాణలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటేలా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కేసీఆర్ కు చెందిన టీ న్యూస్ ఛానల్ లో ఓ స్పెషల్ బతుకమ్మ సాంగ్ కు టెలికాస్ట్ చేశారు. నాలుగు నిమిషాల పాటు సాగే ఈ సాంగ్ లో ప్రత్యేక ఆకర్షణగా ఆకట్టుకుంది ఈ సీనియర్ యాంకర్ ఉదయభాను. ఇక ఈ బతుకమ్మ సాంగ్ లో కేసీఆర్ కుమార్తె.. ఎంపీ కల్వకుంట్ల కవిత కూడా కనిపిస్తారు.

ఇలా కేసీఆర్ ఆయనకు తెలియకుండానే ఉదయభానుకు సర్‍ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చి మళ్లీ క్రేజ్ వచ్చేలా చేశారు. కొన్ని రోజుల క్రితం ప్రత్యేకంగా కేసీఆర్ ను కలిసింది ఉదయభాను. అప్పుడే ఈ సాంగ్ సంబంధించిన మాట కూడా చెప్పారని అంటున్నారు. అలానే తెలంగాణ సంస్కృతిని ప్రచారం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం రూపొందించే వీడియోలు.. షార్ట్ ఫిలిమ్స్ లో కూడా మెరిసిపోనుందట ఉదయభాను. ఇక అలానే రాబోయే ఎన్నికల్లో ఉదయభాను పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనుందని టాక్ కూడా వినిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -