Saturday, May 11, 2024
- Advertisement -

నాకు తెలియ‌కుండా ఎవ‌రితోనే..

- Advertisement -
  • మ‌న‌సుకు న‌చ్చింది టీజ‌ర్ విడుద‌ల‌

ఘ‌ట్ట‌మ‌నేని వంశంలో పుట్టి హీరోయిన్‌గా రాణించాల‌నుకున్నారు.. కుద‌ర‌లేదు.. ద‌ర్శ‌కురాలిగా ప్ర‌య‌త్నించారు. అచ్చిరాలేదు.. చివ‌ర‌కు ఇప్పుడు ద‌ర్శ‌క‌త్వం, నిర్మాణం చేప‌ట్టాల‌ని మంజుల నిర్ణ‌యించుకున్నారు. సినిమాల్లో క‌న్నా నటించడం, నిర్మాణం, ఇతర వ్యాపారాల్లో బిజీ అయ్యారు. ప్ర‌స్తుతం ఆమె దర్శకత్వం చేస్తున్నారు. త‌న‌కు న‌చ్చిన‌ట్టుగా ఉండాల‌ని భావించే ఆమె తనే అన్నీ సమకూర్చుకుని, దర్శకత్వం చేస్తోంది. సినిమాను కూడా నిర్మింస్తోంది. ఆనంది ఆర్ట్స్ కిరణ్ సహ నిర్మాతగా వ్య‌హరిస్తున్నారు.

సందీప్ కిషన్, అమైనా దస్తూరి హీరోహీరోయిన్లుగా తీసుకొని మనసుకు నచ్చింది అనే సినిమా తీస్తోంది. తన మనసుకు నచ్చింది చేయాలని భావించే ఆమె సినిమా ద‌ర్శ‌క‌త్వం, నిర్మాణం చేయ‌డం క‌లిసొచ్చే అవ‌కాశం ఉందేమో. ఈ సినిమా ఫస్ట్‌లుక్, టీజర్ విడుద‌ల చేశారు. టీజ‌ర్ ఆహ్లాదంగా ఉంది.

ప్ర‌తీ మ‌నిషిలో ప్ర‌పంచ‌మంతా ప్రేమ ఉంటుంది రా..కానీ పాయింట్ వ‌న్ ప‌ర్సంట్ కూడా బ‌య‌ట‌కు రావ‌డం లేదు. ఒక‌సారి మ‌న హార్ట్‌తో మ‌నం క‌నెక్ట‌యితే ఆ ప్రేమంతా ప‌రిచ‌య‌మ‌వుతుంది అని హీరోయిన్ అంటుండ‌గా. ఆర్ యూ ఇన్ ల‌వ్‌… ఎస్ ఐ యామ్ ఇన్ అని హీరోయిన్ బ‌దులిచ్చే టీజ‌ర్ బాగుంది. మ‌న‌సుకు న‌చ్చిన‌ట్టు ఎవ‌రైనా ఉంటారు. విజువల్స్, ఫీలింగ్స్ ఫ్రెష్‌గా ఉన్నాయి. ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో ఈ సినిమా వ‌స్తోంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -