Sunday, May 12, 2024
- Advertisement -

విరుష్క పెళ్లి రిసెప్ష‌న్ మీకోసం

- Advertisement -

ముచ్చ‌టైన జంట‌ను చూడండి

భార‌త క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శ‌ర్మ పెళ్లితో ఇద్ద‌రు ఒక్క‌టయ్యారు. ప్రస్తుతం వారి పెళ్లి ఫొటోస్ సోషల్ మీడియాలో చుట్టేస్తున్నాయి. వీరి జంట చూడ‌ముచ్చ‌ట‌గా ఉంద‌ని ప్ర‌ముఖులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇద్దరు సెల‌బ్రిటీలు కావ‌డంతో దేశ‌మంతా వీరి పెళ్లి ముచ్చ‌టే వినిపిస్తోంది.పెళ్లిన‌యితే చెప్పాపెట్ట‌కుండా కొద్దిమంది స‌మ‌క్షంలో చేసుకున్నారు. ఇక వివాహ విందు అంద‌రూ ప్ర‌ముఖుల‌ను పిలిచేందుకు విరుష్క జోడీ గ్రాండ్‌గా రిసెప్ష‌న్ ఇవ్వ‌నున్నారు.

వీరి రిసెప్ష‌న్ ఇన్విటేష‌న్ కార్డు బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆ కార్డులో విరాట్ – అనుష్క పేర్లతో పటు వారి తల్లిదండ్రుల పేర్లు ఉన్నాయి. డిసెంబర్ 21వ తేదీన గురువారం న్యూఢిల్లీలోని స్టార్ హోటల్ లో రిసెప్షన్ ఇవ్వ‌నున్నారు. దీని త‌ర్వాత విరాట్ కోహ్లీ తన సన్నిహిత ఆటగాళ్లకు ప్ర‌త్యేకంగా ముంబాయ్‌లో ఇవ్వ‌నున్నాడు. ఈ వేడుక‌కు విదేశీ ఆటగాళ్లు కూడా ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉంది. అనుష్క శర్మ కూడా బాలీవుడ్ ప్రముఖ నటీనటులు, దర్శక, నిర్మాతలు త‌దిత‌రులంద‌రికీ క‌లిపి డిసెంబర్ 26వ తేదీన ముంబైలో రిసెప్ష‌న్ ఇవ్వ‌నున్నారు. ఇక వీరి పెళ్లి ఫొటోలు మీరు కూడా చూడండి.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -