Sunday, May 12, 2024
- Advertisement -

నేను అంధుణ్ణి అంటున్న సునీల్

- Advertisement -

బాలీవుడ్ చిత్ర పరిశ్రమ లో గత ఏడాది రిలీజ్ అయిన అన్ని చిత్రాలలో అందాధున్ ఒక ప్రత్యేకమయిన స్థానం సంపాదించుకుంటుంది. అయుష్మన్ కురాణ, టబూ, రాధిక ఆప్టే ప్రధాన పాత్రల లో వచ్చిన ఈ సినిమా కి శ్రీరామ్ రాఘవన్ దర్శకుడు. ఈ సినిమా బాలీవుడ్ లో అతి పెద్ద విజయం సంపాదించన తరువాత వేరే భాషల్లో రీమేక్ అవుతుందనే వార్తలు చాలా వచ్చాయి.

తమిళం లో సిద్ధార్థ్ ఈ సినిమా ని రీమేక్ చేస్తున్నా అని అధికారికంగా ప్రకటించాడు కూడా. సిద్ధార్థ్ సరసన ఈ సినిమా లో ఎవరు నటిస్తారు అనే విషయం పై క్లారిటీ లేదు. అయితే సిద్ధార్థ్ తమిళం లో చేసిన ఈ సినిమా ని తెలుగు లో డబ్బింగ్ చేస్తారు అని అందరూ భావించగా ఇప్పుడు తెలుగు లో సెపరేట్ గా ఈ సినిమా ని రీమేక్ చేయనున్నట్లు సమాచరం.

ఆసక్తికరమైన అంశం ఏంటంటే అయుష్మాన్ కురాణ చేసిన పాత్ర లో సునీల్ ని తీసుకుందాం అని నిర్మాతలు అనుకుంటున్నారు అట. తెలుగు సినిమా పరిశ్రమకి సంబందిచిన ఒక పెద్ద నిర్మాత సంస్థ ఈ సినిమా రీమేక్ రైట్స్ కొని సునీల్ ని పెట్టీ రీమేక్ చేయాలి అని భావిస్తుంది అట. ఈ సినిమా కి సంబంధించిన చర్చలు గత వారం రోజులుగా జరుగుతున్నాయి కానీ ఇంకా ఈ విషయం పై క్లారిటీ రాలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -