- Advertisement -

థియేటర్ కొనబోతున్న గురూజీ

- Advertisement -

తెలుగు సినిమా పరిశ్రమలో అగ్ర దర్శకుల్లో ముందు ఉండే పేరు త్రివిక్రమ్ శ్రీనివాస్. సినిమా పరిశ్రమ మొత్తం లో అందరికంటే ఎక్కువ పారితోషికం తీసుకునే దర్శకుడిగా కూడా ఇతనికి పేరు ఉంది. గత కొద్ది కాలం గా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మాణ సంస్థ కు మాత్రమే సినిమా లు చేస్తూ వస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక సినిమా కి దాదాపుగా 15 కోట్లు దాకా తీసుకుంటాడు అని గుసగుసలు నడుస్తున్నాయి. అయితే, ఆయన ఒక సినిమా పై వచ్చే సంపాదనలో చాలా భాగం రియల్ ఎస్టేట్ లో పెడుతున్నట్లు సమాచారం.

ఇదే విధంగా గా హైదరాబాద్, విశాఖపట్నం మరియు విజయవాడ లో రియల్ ఎస్టేట్ రంగం లో చాలా ప్రాపర్టీ ల లో త్రివిక్రమ్ శ్రీనివాస్ డబ్బులు ఇన్వెష్ట చేసినట్టుగా తెలుస్తుంది. అయితే వాటి మీద చాలా ప్రాఫిట్స్ సంపాదించిన త్రివిక్రమ్ ప్రస్తుతం సినిమా ఎక్స్హిబిషన్ రంగం లో అడుగు పెట్టాలని భావిస్తున్నారట.

తాజా సమాచారం మేరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ తూర్పు గోదావరి జిల్లా రాజానగరం లో రాయుడు అనే థియేటర్ ని కొనుగోలు చేసుకున్నట్టు సమాచారం. 5 కోట్ల రూపాయిలు వెచ్చించి ఈ సినిమా థియేటర్ నీ కొనుక్కొని దాన్ని రెనోవేషన్ కూడా చేయించాలని అనుకుంటున్నారట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -