Saturday, May 4, 2024
- Advertisement -

నితిన్- త్రివిక్రమ్ సినిమాకు సంబంధించి సూపర్ ట్విస్ట్!

- Advertisement -

నితిన్ హీరోగా.. త్రివిక్రమ్ దర్శకత్వంలో ప్రకటించబడిన “అ..ఆ..” ‘అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారీ”

సినిమాకు సంబంధించి ఇదొక సూపర్ ట్విస్ట్ . టైటిల్ తోనే సగం మార్కులు కొ్ట్టేసిన ఈ సినిమాకు సంబంధించి అసలు ట్విస్ట్ ను తాజాగా రివీల్ చేశారు. ముందుగా ఈ సినిమా టైటిల్ ను బట్టి అనసూయ అనేది హీరోయిన్ పేరు, ఆనంద్ విహారీ అనేది హీరో పేరు అని చాలా మంది అనుకున్నారు. నితిన్ ఆనంద్ విహారీగా,హీరోయిన్ సమంత అనసూయగా కనిపిస్తుందనే అభిప్రాయాన్ని ఏర్పరుచుకున్నారు. అయితే… ఇప్పుడు ఆ అంచనాలు తప్పాయి!

అసలు విషయం ఏమిటంటే.. ఈ సినిమాలో అనసూయ రామలింగం పాత్రధారి నదియానట! ఆమె ఈ పాత్రలో కనిపిస్తుండగా… ఆనంద్ విహారీ పాత్రలో నితిన్ కనిపించనున్నాడు. నదియా చేయబోయేది నితిన్ కు అత్త పాత్ర అని తెలుస్తోంది. అలా అత్తా అల్లుడిల మధ్య జరిగే పోరాటమే ఈ సినిమా! దీన్ని బట్టి మళ్లీ త్రివిక్రమ్ ఫ్యామిలీ సబ్జెక్ట్ తోనే వస్తున్నాడని అర్థం చేసుకోవచ్చు. అయితే అనసూయ రామలింగం అంటే అది సమంత పేరు అనుకున్న వాళ్లకు ఇప్పుడు అసలు ట్విస్ట్ మాత్రం ఆసక్తికరంగా మారింది. మరి ముందు ముందు ఈ సినిమా ప్రేక్షకుల్లో ఇంకా ఎంత ఆసక్తిని రేకెత్తిస్తుందో చూడాలి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -