Monday, April 29, 2024
- Advertisement -

పోస్ట‌ర్‌లో ఉన్న ద‌మ్ము సినిమాలో కూడా ఉంటే బాగుండు..!

- Advertisement -

త‌మిళ సూప‌ర్‌స్టార్ ర‌జినికాంత్ గురించి మ‌నం ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకొవ‌ల్సిన అవ‌స‌రం లేదు. ఆయ‌న సినిమాలు విడుద‌ల అవుతుంటే ఇండియా బాక్సాఫీస్ మొత్తం షేక్ అవుతుంది. అయితే గ‌త కొంత‌కాలంగా ర‌జినీకాంత్ న‌టించిన సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఘోరంగా ఫెయిల్ అవుతున్నాయి.ఎన్నో అంచ‌నాలు మ‌ధ్య విడుద‌లైన క‌బాలి,కాలా సినిమాలు ప్లాప్‌లుగా నిలిచాయి. తాజాగా ర‌జినీకాంత్ యువదర్శకుడితో కలిసి సినిమా చేస్తున్నాడు. పిజ్జా సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న కార్తిక్ సుబ్బరాజ్ రజినీకాంత్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. తలైవా 165వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు.

‘పెట్టా’ అనే టైటిల్ తో రాబోతున్న ఈ సినిమాలో రజినీకాంత్ లుక్ సరికొత్తగా ఉండబోతుంది. మోషన్ పోస్టర్ ని చాలా ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేశారు దర్శకుడు. ఈ సినిమాలో రజినీకాంత్ తో పాటు విజయ్ సేతుపతి, నవాజుద్దీన్ సిద్ధిఖీ, బాబీ సింహా, త్రిష, సిమ్రాన్ వంటి తారలు కనిపించనున్నారు. అనిరుద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. సినిమా పోస్ట‌ర్‌లో ఉన్న ద‌మ్ము సినిమా క‌థ‌లో కూడా ఉంటే బాగుంటుంద‌ని ఆయ‌న అభిమానులు ఆశిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -