Monday, April 29, 2024
- Advertisement -

ఈ వారం ఎలిమినేట్ అయ్యేది వారేనా?

- Advertisement -

బిగ్‌బాస్ రెండో సీజ‌న్ ముగింపు ద‌శ‌కు చేరుకుంది.మ‌రో 10 రోజుల్లో బిగ్‌బాస్ రెండో సీజ‌న్ విన్న‌ర్ ఎవ‌రో తెలిసిపోనుంది. బిగ్‌బాస్ హౌస్‌లో ఇంకా ఎనిమిది మంది స‌భ్యులు ఉన్నారు. మ‌రో రెండు ఎలిమినేష‌న్ ఉండ‌నుండటంతో బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎవ‌రు బ‌య‌ట‌కి వ‌స్తారో అని అంద‌రిలోను ఆస‌క్తి నెల‌కొంది. ఇక ఈ వారం దీప్తి, శ్యామ‌ల‌, కౌశ‌ల్‌, అమీత్‌లు ఎలిమినేట్‌కు నామినేట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ వారం బిగ్‌బాస్ హౌస్‌ను వ‌దిలి ఎవ‌రు బ‌య‌టికి వ‌స్తారో చూడాలి.ఎప్ప‌టి లాగే ఈ వారం ఎవ‌రు బ‌య‌టికి వ‌స్తారో ముందే ఊహిస్తున్నారు బిగ్‌బాస్ ప్రేక్ష‌కులు.ఈ వారం ఖచ్చితంగా బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది అమీత్ అని చాలా మంది అభిప్రాయ‌ప‌డ‌తున్నారు.ఇప్ప‌టికే అమీత్ బిగ్‌బాస్ హౌస్‌లో చాలా ఎక్కువ రోజులు ఉన్నాడని ,అత‌ను చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నాడ‌ని చాలా మంది అభిప్రాయ‌ప‌డ‌తున్నారు.దీంతో అత‌నే ఈ వారం బిగ్‌బాస్ హౌస్ నుంచి బ‌య‌టికి వ‌చ్చేస్తాడ‌ని భావిస్తున్నారు.

ఒకవేళ బిగ్‌బాస్ ఆలోచ‌న వేరేలా ఉంటే మాత్రం యాంక‌ర్ శ్యామల బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే అవ‌కశాలు క‌నిపిస్తున్నాయి.కౌశల్ ఆర్మీ మ‌ద్ద‌తుతో బిగ్‌బాస్‌లో రీఎంట్రీ ఇచ్చిన శ్యామ‌ల లోనికి వెళ్లిన త‌రువాత కౌశ‌లకు వ్య‌తిరేకంగా మాట్లాడటం మొద‌లు పెట్టింది.దీంతో ఆమెపై తీవ్ర కోపంతో ఉన్నారు కౌశ‌ల్ ఆర్మీ.కౌశ‌ల్ ఎలిమినేట్‌కు నామినేట్ అయి ఉన్న అత‌నికి ఉన్న ఫాలోయింగ్ ద్వారా అతను ఈ వారం కూడా సేవ్ అయ్యే అవ‌కాశాలు ఎక్కువుగా క‌నిపిస్తున్నాయి.ఇక దీప్తి ఎలిమినేష‌న్‌లో ఉన్న శ్యామ‌ల‌,అమీత్‌ల వ‌ల్ల ఆమె సేవ్ అవ‌కాశం ఉంది.మ‌రి వీరిద్ద‌రిలో ఎవ‌రు బ‌య‌టికి వ‌స్తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -