Monday, April 29, 2024
- Advertisement -

అబ్బే తూచ్‌….క‌ర్నాట‌క రాజ‌కీయ సంక్షోభంలో మాప్ర‌మేయంలేదు

- Advertisement -

కర్ణాటకలో రాజకీయ సంక్షోభం ముదిరి పాకాన ప‌డింది. ఇప్పటికే 13 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా.. స్వతంత్ర ఎమ్మెల్యే నగేష్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు. దీంతో కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి సంక్షోభంలో ప‌డింది. ప్ర‌స్తుతం కాంగ్రెస్-జేడీఎస్ కూటమి బలం 104కు పడిపోయింది. దీంతో సీఎం కుమార‌స్వామి రాజీనామా చేయాల‌ని ప్ర‌తిప‌క్ష‌పార్టీ బాజాపా డిమాండ్ చేస్తోంది.

ఇదే విష‌య‌మై లోక్‌స‌భ‌లో కాంగ్రెస్, జేడీఎస్ , భాజాపా మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగింది. క‌ర్నాట‌క‌లో రాజ‌కీయ సంక్షోభానికి భాజాపానే కార‌ణ‌మ‌ని విపక్ష సభ్యలు నినాదాలు హోరెత్తాయి. సభలో పలుమార్లు అడ్డుకొని, స్పీకర్ చైర్ వద్ద ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. దీనిపై రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కల్పించుకున్నారు. విపక్ష సభ్యుల ఆరోపణలను తోసిపుచ్చారు. కర్ణాటక సంక్షోభానికి తమకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే .. నేరాన్ని మా వైపే వేస్తారా అని ఎదురు ప్రశ్నించారు. విపక్ష సభ్యుల ఆరోపణలు పసలేనివని కొట్టిపారేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయదు అని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు తాము చిత్తశుద్ధితో పని చేస్తున్నామని తెలిపారు. రాజీనామాల పరంపర రాహుల్‌ గాంధీతోనే ప్రారంభమైందన్నా

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -