Friday, March 29, 2024
- Advertisement -

‘ఎన్ జి కే’ కి అంత సీన్ ఉందా?

- Advertisement -

టాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కోలీవుడ్ స్టార్ హీరోల లో సూర్య కూడా ఒకరు. తాజాగా సూర్య, సెల్వరాఘవన్ దర్శకత్వంలో నటించిన ‘ఎన్ జి కే’ అనే ఒక పొలిటికల్ డ్రామా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మాస్ ఎంటర్టైనర్ గా విడుదల కాబోతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్ తో కూడా విపరీతమైన పాజిటివ్ రెస్పాన్స్ ను అందుకున్న ఈ చిత్రం తెలుగులో మాత్రం అంతగా అంచనాలను పెంచలేకపోతోంది. తమిళ ఫ్లేవర్ బాగా ఎక్కువగా ఉండటంతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఈ చిత్రం అంతగా ఆకర్షించలేక పోతోంది.

తమిళంలో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నప్పటికీ తెలుగులో మాత్రం ఏ మాత్రం బజ్ లేకుండా ఈ సినిమా ‘ఫలక్నుమా దాస్’, ‘అభినేత్రి 2’ సినిమాలతో పాటు మే 31న విడుదల కాబోతోంది. తాజా సమాచారం ప్రకారం ప్రముఖ నిర్మాత కె.కె.రాధామోహన్ ఈ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్ ను 9 కోట్లు పెట్టి కొనుక్కున్నారట. సాయిపల్లవి రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. మరి ఈ సినిమా తెలుగులో లో డిస్ట్రిబ్యూటర్లకు కు లాభాలు అందిస్తుందో లేదో వేచి చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -