Tuesday, May 21, 2024
- Advertisement -

భార‌స్కోరు చేసిన ఇంగ్లండ్…స‌ఫారీల టార్గెట్‌.. 312

- Advertisement -

ప్ర‌పంచ క‌ప్‌లో భాగంగా తొలి మ్యాచ్ ఇంగ్లండు, సౌతాఫ్రికాల మ‌ధ్య జ‌రిగింది. మొద‌ట టాస్ గెలిచిన స‌ఫారీలు ఇంగ్లండును బ్యాటింగ్‌కు ఆహ్వానించారు. అయితే ఆదిలోనె ఇంగ్లండుకు ఎదురు దెబ్బ త‌గిలింది. ఓపెన‌ర్ బేయిర్ స్టో తాహిర్ బౌలింగ్‌లో గోల్డెన్ డ‌కౌట్‌గా వెనుతిరిగారు.ఇంగ్లండ్ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది

బెయిర్‌స్టో అవుట్ అయిన త‌ర్వాత వ‌చ్చిన జో రూట్ (50 : 59 బంతుల్లో 5×4), ఓపెనర్ జేసన్ రాయ్ (54: 53 బంతుల్లో 7×4) రెండో వికెట్‌కి 106 పరుగుల భాగస్వామ్యంతో ఇంగ్లాండ్‌ని మెరుగైన స్థితిలో నిలిపే ప్రయత్నం చేశారు. కాని వ‌రుస ఓవ‌ర్లో ఇద్ద‌రుపెవిలియ‌న్ చేర‌డంతో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (52 నాటౌట్: 55 బంతుల్లో 4×4, 3×6) బెన్‌స్టోక్స్ (31 నాటౌట్: 36 బంతుల్లో 2×4) చక్కటి సహకారం అందిస్తుండటంతో ఇంగ్లాండ్ జట్టు 34 ఓవర్లు ముగిసే సమయానికి 192/3తో నిలిచింది.

ఇక సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి 3 వికెట్లు తీయ‌గా, ఇమ్రాన్ తాహిర్, రబాడాలకు తలో 2 వికెట్లు దక్కాయి. అలాగే పెహ్లుక్‌వాయో 1 వికెట్ సాధించాడు. ఈ క్రమంలో సౌతాఫ్రికా ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే.. 312 పరుగులు చేయాల్సి ఉంది. ఇప్పటి వరకూ కనీసం ఒక్కసారి కూడా ప్రపంచకప్ గెలవలేకపోయిన ఈ రెండు జట్లూ కనీసం ఈ సారైనా విజేతగా నిలవాలని ఆశిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -