తమిళ స్టార్ సూర్యకు తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. సూర్య నటించిన ప్రతి సినిమా తమిళంతో పాటు, తెలుగులో కూడా విడుదల అవుతోంది. తెలుగులో సూర్యకు మంచి మార్కెట్ ఉంది. సూర్య తన కొత్త సినిమాను లైన్లో పెట్టాడు. ప్రస్తుతం ఆయన సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ‘NGK’ సినిమాలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్. ప్రస్తుతం ఉన్న కాలంలో రాజకీయాలు ఎలా ఉన్నాయో ఈ సినిమాలో చూపించబోతున్నారు.
‘అరేయ్.. అది శ్మశానం రా.. లోపలికి వెళ్లినవాడు శవంగానే బయటికి వస్తాడు” అంటూ సూర్య చెప్పే డైలాగ్ ట్రైలర్‌కే హైలైట్ అని చెప్పాలి. ఈ సినిమాలో సూర్యకు జోడిగా ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమానే మే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషలలో ఒకేసారి విడుదల చేయనున్నారు.
- Advertisement -
సూర్య ‘NGK’ ట్రైలర్
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -