Friday, April 26, 2024
- Advertisement -

ప‌వ‌న్ పాట‌కు సూర్య‌కాంతం.. సుహాసిని స్టెప్పులు

- Advertisement -

మెగా హీరోయిన్ నిహారిక త‌న బాబాయి సూప‌ర్ హిట్ చిత్రం ఖుషీలోని ‘అమ్మాయే సన్నగా..’ పాటకు స్టెప్పులేసింది. అయితే ఇక్క‌డ మ‌రో విష‌యం ఏమంటే ఆమె ఒక్క‌తే వేయ‌డం కాదు అల‌నాటి అందాల న‌టి సుహాసినితో కూడా డ్యాన్స్ చేయించింది. సూర్య‌కాంతం సెట్ లో వీరిద్ద‌రు స‌ర‌దాగా డ్యాన్స్ చేయ‌గా ఆ వీడియోని ఆ మూవీ యూనిట్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది.

మెగా హీరోయిన్‌ నిహారిక, రాహుల్‌ విజయ్‌లు నటించిన ‘సూర్యకాంతం’ చిత్రం ఈ నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్ర బృందం ప్రమోషన్స్‌ ప్రారంభించింది. అయితే ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు మంచి స్పందన లభించింది. తాజాగా సూర్యకాంతం షూటింగ్‌ సమయంలో జరిగిన ఈ సీన్‌ను కూడా ప్ర‌మోష‌న్‌కు వాడేసింది మూవీ యూనిట్‌. ఈ మూవీ మార్చి 29న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -