తమిళ హీరో సూర్యకు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే. అతను నటించిన ప్రతి సినిమా తెలుగులో కూడా విడుదల అవుతుంటాయి. సూర్య తాజాగా హీరోగా నటించిన సినిమా ‘NGK’. సెల్వరాఘవన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా టీజర్‌ను ఈ రోజు విడుదల చేశారు. ఒక నిముషానికి పైగా నిడివి ఉన్న ఈ టీజర్లో స్టొరీ పెద్దగా రివీల్ చెయ్యలేదు కానీ సినిమా నేపథ్యం మాత్రం చూపించారు.సూర్య ట్రాక్టర్‌తో పొలం దున్నుతూ కనిపిస్తాడు.
నా పేరు నంద గోపాలన్ కుమరన్ అందరూ షార్ట్‌గా ఎన్జీకే అని పిలుస్తుంటారని చెబుతాడు సూర్య. నీలాంటి వారు కనుక రాజకీయాల్లోకి వస్తే ఈ దేశం ఎంత బాగుటుందో” అని ఒక వ్యక్తి సూర్యతో చెప్పడం టీజర్‌లో చూపించారు.టీజర్‌ను చూస్తుంటే ఈ సినిమా పొలిటికల్ డ్రామాగా కనిపిస్తోంది. సినిమాలో హీరోయిన్లుగా రకుల్, సాయి పల్లవిలు నటించారు. గతంలో ఇలాంటి కథలతో చాలానే సినిమాలు వచ్చాయి. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందోమ చూడాలి.యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీతం అందించారు.
- Advertisement -
సూర్య ‘NGK’టీజర్ కొత్తగా ఉందే..!
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -