Tuesday, April 30, 2024
- Advertisement -

అల్లు అర్జున్ సినిమాలో అక్కినేని హీరో

- Advertisement -

వరుస డిజాస్టర్ లను అందుకున్న అక్కినేని హీరో సుశాంత్ తాజాగా ‘చిలసౌ’ సినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు. ఇక అదే జోరుతో ఇప్పుడు ఒక స్టార్ హీరో సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. తాజా సమాచారం ప్రకారం సుశాంత్ అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమాలో ముఖ్య పాత్ర పోషించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపాడు సుశాంత్. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్ మరియు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

“#AA19 సెట్స్‌లో ఇది నా మొదటి రోజు. ఈ సినిమా గురించి నేను అప్పుడే ఎక్కువవ చెప్పలేను. కానీ, నాకు చాలా ఇష్టమైన దర్శకుల్లో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, ‘ఆర్య’ నుంచి ఇప్పటి వరకు నేను ఆదరించే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్(బన్నీ), పవర్ హౌజ్ టబు గారు, నా ఫ్రెండ్ పూజ, పీఎస్ వినోద్ సర్, తమన్, మరియు మిగతా అద్భుతమైన నటీనటులు, సాంకేతిక నిపుణులు తో పని చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే హారిక అండ్ హాసిని, గీతా ఆర్ట్స్‌కి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ‘చి ల సౌ’ తరవాత ఇది నాకు మరో అడ్వెంచర్ లాంటిది. ఇంత అద్భుతమైన టీమ్ నుంచి నేను చాలా నేర్చుకుంటానని అనుకుంటున్నాను” అని సుశాంత్ ట్వీట్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -