Wednesday, May 15, 2024
- Advertisement -

బెంగాలీలో ‘టైటానికా’?

- Advertisement -
  • పుకార్లు షికార్లు
  • అలాంటిదేమీ లేద‌ని న‌టీన‌టుల ప్ర‌క‌ట‌న‌

హాలీవుడ్‌లో అద్భుత విజయం సాధించిన ‘టైటానిక్‌’ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా అద్భుత‌వంగా ఆడింది. టైటానిక్ ప‌డ‌వ మునిగిన‌ప్పుడు అంత సంచ‌ల‌నం కాలేదు. కానీ ఈ సినిమా విడుద‌ల కావ‌డం సంచ‌ల‌నం రేపి రికార్డులు తిరిగిరాసింది. ఆ సినిమా చూడ‌ని వారు అంటూ ఎవ‌రూ ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. హాలీవుడ్ సినిమాలు ఆస‌క్తి లేని వాళ్లు కూడా ఈ సినిమాను చూశారు. అలాంటి రీమేక్ ఇప్ప‌టివ‌ర‌కు భార‌త‌దేశంలో దాదాపుగా ఎక్క‌డా రాలేదు. ఆ సినిమా రీమేక్ చేయాలంటే పెద్ద సాహ‌స‌మే చేయ‌డం లాంటిది. అంత భారీ స్థాయి సినిమాను తీయ‌డానికి బోలెడు ఖ‌ర్చు అవుతుంది. మ‌రో రెండు బాహుబ‌లులు తీసుకున్న టైం తీసుకునే అవ‌కాశం ఉంది. అయితే ఈ సినిమా రీమేక్‌ను బెంగాలీలో తీయ‌నున్నారట. టైటానిక్ హీరో లియోనార్డో డికాప్రియో పాత్రలో బెంగాలీ నటుడు దేవ్‌ నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రానికి రాజ్‌ చక్రవర్తి దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది.

1997లో జేమ్స్‌ కెమెరూన్‌ తెరకెక్కించిన ‘టైటానిక్‌’ చిత్రాన్ని ప్రాంతీయ భాషల్లో తెరకెక్కించడం అంత సులువేం కాదు. అదీకాకుండా సినిమాలో రోస్ (కేట్‌ విన్స్‌లెట్‌), జాక్ (డికాప్రియో) పాత్రలు ప్ర‌ధాన‌మైన‌వి. ఇక హీరోయిన్‌ కేట్‌ విన్స్‌లెట్‌ పాత్రలో బెంగాలీ నటి రుఖ్మిణి మైత్రాను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. టైటానిక్‌ రీమేక్‌పై వార్తలు వెలువడుతుండడంతో రుఖ్మిణి వెంటనే ట్విటర్‌లో కొట్టిపారేశారు. దీనిపై క్లారిటీ ఇచ్చారు. ‘అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను, దేవ్‌ ‘టైటానిక్‌’ రీమేక్‌లో నటించనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇందులో ఏమాత్రం నిజం లేదు. ఇలాంటి వార్తలు ఎవరూ సృష్టిస్తున్నారో తెలీదు కానీ వారికి మంచి హాస్యచతురత ఉంది. ఇవన్నీ విని నేను నవ్వు ఆపుకోలేకపోయాను’ అని తెలిపారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -