Saturday, May 25, 2024
- Advertisement -

థియేట‌ర్ ముందు నిల‌బెడ‌తా

- Advertisement -
  • ర‌చ‌యిత రివ్యూ అడుగుతానంటున్న జ‌గప‌తిబాబు

త‌న మిత్రుడు తీస్తున్న సినిమాకు జ‌గ‌ప‌తి బాబు తోడ‌య్యారు. ఆ సినిమాను విజ‌య‌వంతం చేయ‌డానికి త‌న చేత‌నైనా సాయం చేస్తున్నాడు. అందుక‌ని చిన్న సినిమాల ప్రోత్సాహానికి విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్ట‌ణం, హైద‌రాబాద్‌ల‌లో పాద‌యాత్ర‌లు చేప‌ట్టారు. ర‌చ‌యిత సినిమా పాటల విడుద‌ల కార్య‌క్ర‌మం పాట‌ల ర‌చ‌యిత చంద్ర‌బోస్ నివాసంలో జ‌రిగింది. నటుడు జగపతిబాబు సమక్షంలో చంద్రబోస్ పాడి వినిపించడంతో ఈ ఆడియా విడుదల చేశారు.

“నాకు రచయితలంటే చాలా గౌరవం. ‘రచయిత’ అనే సినిమా సస్పెన్స్ థ్రిల్లర్‌తో తెరకెక్కనుంది. ఈ సినిమా కాన్సెప్ట్ నాకు విపరీతంగా నచ్చడంతో మొదట నేనే నటించాలనుకున్నా. కానీ నా డేట్స్ కుదరకపోవడంతో చేయలేకపోయాను. ఈ చిత్ర దర్శకుడు విద్యాసాగ‌ర్ నా మిత్రుడు. ‘రచయిత’ సినిమాకు ప్రీ రిలీజ్ వేడుక చేయకుండా డైరెక్ట్‌గా పబ్లిక్‌కు చేరేలా డిసెంబర్ 8వ తేదీన ఒక థియేటర్‌లో సినిమాను ప్రదర్శింపచేసి నేనే స్వయంగా థియేటర్ బయట మైక్ పట్టుకుని ప్రేక్షకుల రివ్యూ తెలుసుకుంటాన‌ని జ‌గ‌ప‌తి బాబు ప్ర‌క‌టించారు. ‘ఏ ఎదలో ఏముంటుందో’ అనే పాట బాగా నచ్చిందన్నారు. ఇండస్ట్రీలో పెద్ద వాళ్లు పైపైకి ఎదుగుతున్నారు. చిన్నవాళ్లు ఎప్పటికీ అలాగే ఉండిపోతున్నారనే ఆవేదనతో నేను ‘రచయిత’ సినిమాను సపోర్ట్‌ చేస్తున్నా.

దుహర మూవీస్ ఈ సినిమాను స‌మ‌ర్పిస్తోంది. క‌ల్యాణ్ ధూలిపాళ్ల నిర్మాత‌. కొత్త న‌టీన‌టుల‌తో ఈ సినిమా తీశారు. మలయాళ సంగీత దర్శకుడు శ్యామ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు. ‘‘పాటలు రచించడానికి నేను ఎక్కడికీ వెళ్లను. నా ఇంట్లోనే రాస్తా. అందుకే ‘రచయిత’ పాటలు నా ఇంట్లో జగపతిబాబుగారి సమక్షంలో విడుదల చేశాం’’ అన్నారు చంద్రబోస్‌. 22 ఏళ్ల కెరిర్‌లో 800 పాటలు రాశాన‌ని తెలిపారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -