Sunday, May 19, 2024
- Advertisement -

సందీప్ కిష‌న్‌తో త‌మ‌న్నా రొమాన్స్ …’నెక్స్ట్ ఏంటి’

- Advertisement -

టాలీవుడ్ మోస్ట్ టాలెంట్ హీరోయిన్ ఎవ‌రు అంటే అంద‌రు ఠ‌క్కున చేప్పే పేరు మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా.మ‌రి అలాంటి స్టార్ హీరోయిన్ త‌మ‌న్నా ,ఓ కుర్ర హీరోతో ,అది కూడా వ‌రుస ప్లాప్‌ల‌లో ఉన్న హీరోతో సినిమా చేస్తుంది.హీరో సందీప్ కిష‌న్‌కు చాలా కాలం నుంచి స‌రైన హిట్లు లేవు.ఇంకా చెప్పాలంటే సందీప్ కిష‌న్ ఇంకా సినిమాలు చేస్తున్నాడా అనే వారు కూడా ఉన్నారు.మ‌రి అలాంటి సందీప్ కిష‌న్‌తో త‌మ‌న్నా సినిమా చేస్తుంది అంటే క‌థ‌లో ఏదో వెరైటీ ఉండే ఉంటుంద‌ని భావిస్తున్నారు.తాజాగా ఈ సినిమా టైటిల్‌తో పాటు సినిమాలోని త‌మ‌న్నా,సందీప్ కిష‌న్ ఫ‌స్ట్ లుక్‌ని కూడా విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌.ఫస్ట్ లుక్ పోస్టర్ల విషయానికి వస్తే రెండూ పోస్టర్లలో తమన్నా నాటీగా కనిపించింది.

మొదటి పోస్టర్లో సోఫాలో పడుకుని ఉన్న సందీప్ ను అదే సోఫాపై నిలబడి ఒక దిండుతో కొడుతున్నట్టుగా ఉంది. ఆ నవ్వడం చూస్తుంటే సందీప్ ఏదో చిలిపి జోక్ వేసినట్టే అనిపిస్తోంది. రెండో పోస్టర్లో సందీప్ ఏదో కోపంగా అరుస్తున్నట్టుగా పోజిస్తే.. తమన్నా మాత్రం ఎదురుగా నిలబడి వెటకారంగా వెక్కిరిస్తోంది. రెండు పోస్టర్లు ఒక రొమాంటిక్ ఫిలిం అనే హింట్ ఇచ్చాయి. ఈ సినిమాను లండన్ లోనూ.. హైదరాబాద్ లోనూ చిత్రీకరించారు. ఈ సినిమాను డిసెంబర్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. బాలీవుడ్ దర్శకుడు కునాల్ కోహ్లి ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -