- Advertisement -

ఆ ద‌ర్శ‌కుడితో త‌మ‌న్నాకు ఏం సంబంధం ఉందో ..?

- Advertisement -

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ త‌మ‌న్నా గురించి ఇప్పుడు కొత్త‌గా చెప్ప‌డానికి ఏం ఉంది. మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్‌. తెలుగు, త‌మిళ, హిందీ భాష‌ల‌లో సినిమాలు చేసింది. స్టార్ హీరోల‌తో న‌టించి క్రేజీ హీరోయిన్‌గా మారింది. మ‌రి అటువంటి త‌మ‌న్నా ఓ వివాదంలో ఇరుక్కుంది. కాస్టింగ్ కౌచ్ గురించి ఇటీవ‌లే ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్య్వూలో మాట్లాడింది. ఇండ‌స్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేద‌ని చెప్ప‌ను కాని , త‌న‌కు మాత్రం అటువంటి సంఘ‌ట‌న‌లు ఎదురు కాలేద‌ని త‌మ‌న్నా తెలిపింది. అయితే కాస్టింగ్ కౌచ్ గురించి తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న ద‌ర్శ‌కుడికి త‌న మ‌ద్ద‌తు తెలిపి తీవ్ర విమ‌ర్శ‌ల‌ను ఫేస్ చేస్తుంది.

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సాజిద్ ఖాన్ గురించి కాస్టింగ్ కౌచ్ ఉద్య‌మం సాగుతున్న స‌మ‌యంలో తీవ్ర ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. సాజిద్ ఖాన్‌తో పని చేసిన పలువురు కథానాయికలు ఆయ‌న మ‌మ్మ‌ల్ని లైంగిక వేధింపులు గురి చేశాడ‌ని ఆరోపించారు. మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా మాత్రం అతడిని వెనకేసుకు రావడం ప్రముఖంగా చర్చకు వచ్చింది. సాజిద్ ఖాన్ తన విషయంలో ఎలాంటి తప్పు చేయలేదని అసభ్యంగా ఏనాడూ ప్రవర్తించలేదని ఇదివరకూ పలుమార్లు మిల్కీ బ్యూటీ మీడియా ముఖంగా ఖరాకండిగా చెప్పింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -