Saturday, May 18, 2024
- Advertisement -

భారీ శాంపిల్స్‌తో సమగ్ర సర్వే…….. ఎపిలో విజేత ఎవరు? ఎన్ని సీట్లంటే?

- Advertisement -

ఇప్పటి వరకూ చేసిన అన్ని సర్వేలకంటే అత్యంత ఎక్కువ మంది ఓటర్ల అభిప్రాయాలు తెలుసుకుంటూ ఎక్కువ మంది పరిశీలకులతో చేయించిన సర్వే ఫలితాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నాట చర్చనీయాంశమవుతున్నాయి. జనసేనతో సహా అన్ని పార్టీలకు రాబోయే సీట్ల వివరాలు కూడా వాస్తవాలకు దగ్గరగానే ఉన్నాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. జనసేనకు ఎక్కువ సీట్లు వస్తాయని పవన్ నమ్మకంగా చెప్పొచ్చు. అభిమానులను నమ్మించే ప్రయత్నం చెయ్యొచ్చు కానీ వాస్తవంగా ఆ గెలిచే అభ్యుర్థుల పేర్లు చెప్పమంటే పవన్ కళ్యాణే కాదు…..ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి. అందుకే సీనియర్ విశ్లేషకులు కూడా జనసేనకు సింగిల్ డిజిట్‌కి మించి వచ్చే ఛాన్స్ లేదని ఘంటాపథంగా చెప్తున్నారు. ఇక ఈ ఎన్నికల్లో టిడిపి ఓటమి, వైకాపా గెలుపు గురించి సంవత్సర కాలం ముందే అందరికీ నమ్మకం ఉన్న విషయమే. అయితే ఓట్ల శాతం, సీట్ల సంఖ్యలో ఎంత తేడాలు ఉంటాయి? వైకాపా ఏ స్థాయిలో విజయం సాధించబోతోంది అనే విషయాలకు సంబంధించి ఈ సర్వే చాలా స్పష్టంగా చెప్పుకొచ్చింది.

రాజకీయాలపైన అవగాహన ఉన్నవాళ్ళు, మేధావులు, సీనియర్ జర్నలిస్టులు కూడా ఈ సర్వే చాలా వరకూ ప్రామాణికంగా ఉందని అభిప్రాయపడుతున్నారు. దాదాపుగా ఫలితాలు కూడా ఈ సర్వేల ఇచ్చిన సంఖ్యలకు చాలా వరకూ దగ్గరగా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. తాజాగా టిడిపి గెలుపు కోసమే ఏ స్థాయికి దిగజారి అయినా వార్తా కథనాలు వండివార్చడానికి సిద్ధంగా ఉండే తోకపత్రిక యజమాని కూడా ఈ సారి టిడిపికి కష్టమే అన్న అర్థం వచ్చేలా తన పత్రికలో అభిప్రాయం వ్యక్తం చేశాడు. అయితే ముందు ముందు పుంజుకుంటుంది అన్న అర్థం వచ్చేలా ఆ వెంటనే వక్ర భాష్యం కూడా చెప్పాడు. ఎన్నికలు కేవలం పక్షం రోజుల వ్యవధిలోనే ఉన్న నేపథ్యంలో ఇక నుంచీ మార్పులు వచ్చే అవకాశాలు తక్కువే అన్నది విశ్లేషకుల అభిప్రాయం. మొత్తంగా చూస్తే ఈ సర్వే వివరాలు, ఆ సర్వే తేల్చిన ఫలితాలు వాస్తవ ఫలితాలకు చాలా దగ్గరగా ఉన్నాయని అన్ని పార్టీల నాయకులు కూడా అంతర్గతంగా ఒప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -