Monday, May 6, 2024
- Advertisement -

త‌మ‌న్నా ‘దటీజ్‌ మహాలక్ష్మి’ ఫస్ట్ లుక్‌

- Advertisement -

త‌మ‌న్నా లీడ్ రోల్‌లో న‌టిస్తున్న ‘దటీజ్‌ మహాలక్ష్మి’ సినిమా ఫ‌స్ట్ లుక్‌ని విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌.బాలీవుడ్‌ సూపర్‌ హిట్ క్వీన్‌ సినిమాను దక్షిణాది భాషల్లో ఒకేసారి రీమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను త‌మిళ‌,తెలుగు ,మలయాళ, కన్నడ భాషల్లో ఇటీవల షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. తెలుగు వర్షన్‌కు ముందుగా షో ఫేం నీలకంఠను దర్శకుడిగా తీసుకున్నారు.

కానీ నీలకంఠ ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకోవటంతో ‘అ!’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన ప్రశాంత్‌ వర్మకు దర్శకత్వం బాధ్యతలు అప్పగించారు. తాజాగా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. లంగా వోణీలో ఉన్న తమన్నా పారిస్‌లోని ఐఫిల్‌ టవర్‌ ముందు డాన్స్‌ చేస్తున్నట్టుగా ఉన్న ఈ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌సినిమా మీద అంచనాలను పెంచేస్తోంది.బాలీవుడ్‌లో సంచ‌ల‌నలు సృష్టించిన ఈ సినిమా మ‌రి సౌత్‌లో ఎన్ని సంచ‌ల‌నాల‌కు తెర లేపుతుందో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -