Sunday, May 5, 2024
- Advertisement -

గెలిచిన భ‌క్తుల సెంటీమెంట్‌… శ‌బ‌రిమ‌ళ‌లో తెలంగాణా జ‌ర్న‌లిష్టుకు చుక్కెదురు

- Advertisement -

శ‌బ‌రిమ‌ళ‌లో అయ్య‌ప్ప భ‌క్తుల సెంటీమెంట్ నిజ‌మైంది. 10 నుంచి 50 సంవత్సరాల వయసున్న మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు ఆదేశాలను పోలీసులు పాటించలేకపోయారు. గ‌త రెండు మూడు రోజులుగా శ‌బ‌రిమ‌ళ‌లో స్వామి ద‌ర్శ‌నంకోసం మ‌హిళ‌లు ప్ర‌య‌త్నిస్తుండ‌టంతో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఎప్పుడు ఏంజ‌రుగుతుందోన‌నే ఉత్కంఠ ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. అలాంటి ఉద్రిక్త ప‌రిస్థితుల మ‌ధ్య తెలంగాణాకు చెందిన ఇద్ద‌రు మ‌హిళా జ‌ర్న‌లిస్ట్ క‌విత‌తోపాటు ఎర్నాకులంకు చెందిన రేహ్నా ఫాతిమాలు అయ్యప్ప దర్శనానికి బయల్దేరారు. అయితే వారికి చుక్కెదురైంది.

100 మంది పోలీసులు ఒకవైపు, 20 వేల మంది భక్తులు మరోవైపు నిలువగా, స్వామి దర్శనం కోసం వచ్చిన ఇద్దరు యువతులు వెనుదిరగక తప్పలేదు. అయ్య‌ప్ప స్వామిని ద‌ర్శ‌నం చేసుకొని చ‌రిత్ర సృష్టించాల‌నుకున్న తెలంగాణా మ‌హిళా జ‌ర్న‌లిస్ట్‌కు చేదు అనుభ‌వం ఎదురయ్యింది.

హైదరాబాద్ మోజో టీవీ జర్నలిస్టు కవిత, ఎర్నాకులంకు చెందిన రేహ్నా ఫాతిమాలు పోలీసుల సాయంతో ఆలయం వరకూ మాత్రమే చేరుకోగలిగారు. ఆపై వారి ముందు సముద్రంలా భక్తులు అడ్డు నిలవడంతో పోలీసు కార్యాలయానికి తీసుకెళ్లిన ఐజీ శ్రీజిత్, వారికి పరిస్థితిని చెప్పి, వెనుదిరగాలని కోరడంతో అందుకు వారు అంగీకరించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -