Wednesday, May 15, 2024
- Advertisement -

ఎలిమినేష‌న్‌ మ‌రునాడే పెళ్లి చేసుకున్న బిగ్‌బాస్ కంటెస్టెంట్‌

- Advertisement -

బిగ్‌బాస్ రియాల్టీ షో ఇండియా మొత్తం బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఉర్రూతలూగిస్తున్న సంగ‌తి తెలిసిందే.హిందీలో బాగా పాపుల‌ర్ అయిన ఈ రియాల్టీ షో త‌రువాత కాలంలో తెలుగు ,త‌మిళ బాషల‌లో కూడా ప్రారంభించ‌డం జ‌రిగింది.బిగ్‌బాస్‌లో అడుగు పెట్టిన ప్ర‌తి ఒక్క‌రికి క్రేజ్ అమాంతం పెరిగిపోతుంది.తాజాగా త‌మిళ బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిన మ‌రునాడే పెళ్లి చేసుకుని వార్త‌ల్లో నిలిచాడు.పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే….తమిళంలో నటుడిగా గుర్తింపు దక్కించుకున్న డేనియల్ అన్నె బిగ్‌బాస్‌లోకి సెల‌బ్రిటీగా అడుగు పెట్టాడు.ఇక అత‌ను కొంత‌కాలంగా డెనీషాతో ప్రేమలో ఉన్నాడు డేనియల్.

అత‌ని కోసం బిగ్‌బాస్ హౌస్‌లోకి కూడా వ‌చ్చింది డెనీషా.బిగ్‌బాస్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఉన్న డేనియల్ గ‌త ఆదివారం జ‌రిగిన ఎలిమినేష‌న్‌లో షో నుంచి బ‌య‌టికి వ‌చ్చేశాడు.డేనియల్ షో నుంచి బ‌య‌టికి వ‌చ్చిన మ‌రునాడే అత‌ను ప్రేమించిని డెనీషాను వివాహం చేసుకున్నాడు.తన వివాహంకు సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన డేనియల్ తన లవర్ తాజాగా తన భార్య అయ్యింది అంటూ ప్రకటించాడు.బిగ్ బాస్ పార్టిసిపెంట్ గా భారీ పబ్లిసిటీని క్రేజ్ ను దక్కించుకున్న డేనియల్ వివాహంకు వేలాది మంది సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -