ప‌వ‌న్ వీరాభిమాని ఆత్మ‌హ‌త్య‌..లెట‌ర్‌లో ఏం రాశాడంటే..?

నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ వీరాభిమాని ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. విజయవాడకు చెందిన కొమరవల్లి అనిల్‌ కుమార్ గ‌త కొంత కాలంగా డిప్రెషన్ లో ఉన్న సోమ‌వారం ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. నగరంలోని తల్‌వాకర్స్‌ జిమ్‌లో ట్రైనర్‌గా అనిల్‌ పనిచేస్తున్నాడు. చనిపోయే ముందు పవన్‌ కల్యాణ్‌కు అనిల్‌ ఓ లేఖ రాశారు. దీన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.

తన అభిమాన నటుడు పవన్‌ కల్యాణ్‌, తాను చనిపోయిన తర్వాత చూడటానికి రావాలని లేఖలో పేర్కొన్నారు. అలాగే తన అంత్యక్రియలు పవన్‌ కల్యాణ్‌ చేతుల మీదుగా జరగాలని ఆకాంక్షించారు. ఆయన తప్పకుండా వస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. అనిల్ కుమార్ ఆత్మహత్యతో విజయవాడలోని అతని కుటుంబీకులు, స్నేహితులు కన్నీరు మున్నీరయ్యారు.