సినీ ఇండస్ట్రీలో హత్యలు,ఆత్మహత్యలు ఎక్కువైయ్యాయి. నిన్నటి నిన్న ప్రముఖ తెలుగు సీరియల్ నటి ఝాన్సీ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనను మరవకముందే మరో సినీ నటి హత్య వార్త కలకలం రేపుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే …తమిళ ఇండస్ట్రీకి చెందిన సంధ్య అనే ఆర్టిస్ట్‌ను హత్య చేశాడు ఆమె భర్త బాలకృష్ణన్. తమిళంలో చిన్న సినిమాలలో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది సంధ్య. ఈ క్రమంలోనే ఆమెకు పరిచియాలు ఎక్కువైయ్యాయని తెలుస్తోంది. ఈ పరిచియలతోనే ఆమె దారి తెప్పిందట.రాత్రి వేళల్లో ఫోన్‌లో మాట్లాడటం, బయటకు వెళ్లడం వంటి చర్యలు బాలకృష్ణన్‌కు సంధ్యపై అనుమానాలు కలిగించింది.
ఆమె పలువురితో వివాహేతర సంబంధాలు పెట్టుకుందని అనుమానించిన అతను ఓ రోజు నిలదీయడంతో తన అక్రమ సంబంధాన్ని బయటపెట్టింది. ప్రవర్తన మార్చుకోవాలని ఎన్నిసార్లు చెప్పినప్పటికి ఆమెలో ఎటువంటి మార్పు రాలేదట. దీంతో వీరి మధ్య రోజు గొడవలు జరుగుతుండేవని స్ధానికులు చెబుతున్నారు. ఈ నెల 19న మరోసారి వివాహేతర సంబంధం గురించి ఘర్షణ జరగింది. కోపంలో బాలకృష్ణన్ భార్య సంధ్యను కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి నగరంలోని పలు చోట్ల పడేశాడు.స్థానికులు ఇచ్చిన సమాచారంలో పోలీసులు దర్యాప్తు చెపట్టి బాలకృష్ణన్‌ను అరెస్ట్ చేశారు. అన్నట్లు బాలకృష్ణన్ కూడా దర్శకుడు కావడం విశేషం.ఇతను కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డెరెక్టర్‌గా పని చేశాడు.
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్‌న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’
- ప్రియుడితో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల!
- అమరావతికి మోదీ..5 లక్షల మందితో సభ