Thursday, April 25, 2024
- Advertisement -

బంపర్ ఆఫర్ కొట్టేసిన బుట్ట‌బొమ్మ !

- Advertisement -

అక్కినేని నాగ‌చైత‌న్య‌కు జోడీగా “ఒక లైలా కోసం” సినిమాతో తెలుగు తెర‌కు పరిచమైన న‌టి పూజాహెగ్డే. ఒక లైలా కోసం సినిమా త‌ర్వాత వెనుతిరిగి చూసుకోకుండా ఆమెకు ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. తెలుగులోనే కాకుండా.. ఇతర బాషలలో కూడా వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది ఈ బుట్ట‌బొమ్మ‌. ప్ర‌స్తుతం పాన్ ఇండియా హీరో ప్ర‌భాస్ స‌ర‌స‌న రాధేశ్యామ్ సినిమాలో క‌థానాయిక‌గా న‌టిస్తోంది.

ఈ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ఆచార్య సినిమాలోనూ న‌టిస్తోంది. అలాగే, అక్కినేని యంగ్ హీరో అఖిల్ హీరోగా న‌టిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచుల‌ర్‌ సినిమాలోనూ పూజా హెగ్దే హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇక బాలీవుడ్‌లో ర‌ణ్‌వీర్ సింగ్ స‌ర‌స‌న స‌ర్కస్ మూవీలోనూ నటిస్తుంది. ఇలా బిజీబిజీ గ‌డుపుతున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా మ‌రో క్రేజీ ఆఫ‌ర్ కొట్టేసింది.

త‌మిళ అగ్ర క‌థానాయ‌కుడు, ఇల‌య ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా.. నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రాబోతున్న సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది పూజ‌. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఈ సినిమాలో విజ‌య్ కి జోడీగా పూజా హెగ్దే న‌టించ‌బోతున్న‌ద‌ని తాజాగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది.

ముగ్గురు భామ‌ల‌తో ర‌వితేజ రొమాన్స్

లిప్‌లాక్ తో మ‌త్తెక్కిస్తున్న పూజిత పొన్నాడ‌

ఆరోగ్యానికి ఐదు రకాల జ్యూసులు !

వామ్మో ఈ మూడు పండ్లు తిన్నారో మీ ప‌ని అంతే !

త‌దుప‌రి సీజేఐగా జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ.. ప్ర‌తిపాదించిన జ‌స్టిస్ బోబ్డే

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -