Saturday, May 11, 2024
- Advertisement -

కలర్స్ స్వాతి లైఫ్‌లో కొత్త కలర్ రాబోతోంది..!

- Advertisement -

తెలుగులో స్వాతి కెరీర్ ఏమంత గొప్పగా లేదు. మంచి మంచి హిట్సే ఖాతాలో ఉన్నా.. ఈ తెలుగమ్మాయికి తెలుగు గడ్డ మీద అంతగా కలిసి రాలేదు.

అయితే తమిళ భాషలో మాత్రం ఆమె పరిస్థితి చాలా బాగుంది. అలాగే మలయాలంలో కూడా అవకాశాలున్నాయి. ఇలాంటి నేపథ్యంలో స్వాతి ఒక తెలుగు సినిమా చేస్తోంది. ఇప్పుడు ఇది ఆసక్తికరమైన ఫీట్లను సాధిస్తోంది. ఈ సినిమాను ఒకేసారి ఐదు భాషల్లో విడుదల చేయనున్నారట!

“త్రిపుర” పేరుతో విడుదల అవుతున్న ఈ సినిమాను ఒకేసారి తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నామని ఈ సినిమా యూనిట్ ప్రకటించింది. అయితే కన్నడలో డబ్బింగులు నిషేధం అలాంటిది ఈ సినిమాను అక్కడ ఎలా విడుదల చేస్తారో తెలీదు. ఇదిలా ఉంటే… ఇప్పుడు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కూడా అప్పుడే అమ్ముడయిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా రైట్స్ ను మంచి ఆఫరే కొనుగోలు చేశారట ఒక చానల్ వాళ్లు.

ఈ సినిమాకు స్క్రిప్ట్ కోనవెంకట్ సమకూర్చగా… గీతాంజలి సినిమా దర్శకుడు ఈ సినిమాను రూపొందించాడు. దీంతో త్రిపుర సినిమాకు మంచి మార్కెట్ లభిస్తోంది. స్వాతికి తమిళ, మలయాళ భాషల్లో ఉన్న ఇమేజ్ తో దీన్ని అక్కడకు కూడా డబ్బింగ్ ద్వారా తీసుకెళ్తున్నారు. మొత్తానికి ‘త్రిపుర’ విడుదలకు ముందే ఆసక్తిని రేకెత్తిస్తోంది. విడుదల తర్వాత ఎలాంటి ఫీట్లను సాధిస్తుందో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -