- Advertisement -

ఆత్మ‌హ‌త్య చేసుకున్న హీరోయిన్‌

- Advertisement -

త‌మిళ హీరోయిన్ రియ‌మిక్క బుధవారం ఆత్మ‌హ‌త్య చేసుకుంది. వలసరవక్కం ప్రాంతంలో తను అద్దెకు ఉంటోన్న ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్ చేసుకున్న వద్ద తమకు ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదని పోలీసులు చెప్పారు. కుంద్రతిలే కుమారనుకు కొండట్టం, అఘోరి యిన్ అట్టం ఆరంభం సినిమాల‌లో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకుంది రియ‌మిక్క.వలసరవక్కం ప్రాంతంలో ఓ అద్దె ఇంట్లో జీవిస్తోంది. గత నాలుగు నెలలుగా రియమిక్క తన సోదరుడితోనే కలిసి ఉంటోంది.

సోదరుడు ప్ర‌కాష్ రియమిక్కకి ఎన్ని సార్లు ఫోన్ చేసిన తీయ‌క‌పోవ‌డంతో ఇంటిఇ చేరుకున్న సోదరుడు లోపల నుండి తాళం వేసి ఉండడంతో తన దగ్గర ఉన్న తాళంచెవితో తలుపులు తెరచి చూడగా అప్పటికే రియమిక్క ఫ్యాన్ కి ఉరేసుకొని కనిపించింది.విషయం తెలుసుకున్న పోలీసులు రియమిక్క నివాసానికి చేరుకొని ఆమె డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే రియ‌మిక్క ఎందుకు ఆత్మ‌హ‌త్య చేసుకుందో తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -