Tuesday, May 21, 2024
- Advertisement -

హీరో విజ‌య్‌కు నోటీసులు

- Advertisement -

త‌మ‌ళ హీరోల‌లో ర‌జ‌నీ త‌రువాత అంత‌టి క్రేజ్ ఉన్న హీరో ఎవ‌రు అంటే అంద‌రు ఠ‌క్కున చేప్పే పేరు విజ‌య్‌. అభిమానులు ఈయ‌న‌ను ముద్దుగా త‌లైవా అని పిలుచుకుంటారు. ఇప్పుడు విజ‌య్ గురించి చ‌ర్చ ఎందుక‌నే క‌దా మీ డౌట్‌. హీరో విజ‌య్‌కు తమిళనాడు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా ‘సర్కార్’ సినిమా తెరకెక్కుతోంది. ఆయ‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా సినిమా ఫ‌స్ట్‌లుక్‌ని విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌. ఈ ఫ‌స్ట్‌లుక్‌లో విజ‌య్ స్మోకింగ్ చేస్తూ కనిపించడాన్ని ప్రభుత్వం తప్పుపట్టింది.

ఆ పోస్టరును అన్ని మాధ్యమాల నుంచి వెంటనే చిత్రయూనిట్ వెనక్కి తీసుకోవాలని తెలిపింది. లేకుంటే ప్రభుత్వం హీరో, చిత్ర బృందంపై తగిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించింది. హీరో విజ‌య్‌తో పాటు చిత్ర ద‌ర్శ‌కుడు మురుగదాస్‌కు కూడా నోటీసులు పంపించ‌డం జ‌రిగింది. విజ‌య్‌-మురుగదాస్ కాంబినేష‌న్‌లో ఇప్ప‌టికే రెండు సినిమాలు వ‌చ్చాయి. ఈ రెండు సినిమాలు కూడా ఘ‌న‌విజ‌యం సాధించాయి. ‘సర్కార్’ సినిమాలో విజ‌య్ స‌ర‌స‌న హీరోయిన్‌గా కీర్తి సురేష్ న‌టిస్తుంది.కీర్తి విజ‌య్‌తో న‌టించ‌డం ఇది రెండోసారి.గ‌తంలో భైర‌వ సినిమాలో వీరిద్ద‌రు క‌లిసి న‌టించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -