Thursday, May 9, 2024
- Advertisement -

మ‌హేష్‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన త‌మిళ క‌మెడియ‌న్‌..

- Advertisement -

టాలీవుడ్ లో సూపర్‌ స్టార్ మ‌హేష్ బాబుకు ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. కేవలం స్టార్‌ ఇమేజ్‌ మాత్రమే కాదు నటుడిగానూ ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నాడు మహేష్. ప్రిన్స్‌పై ఓత‌మిళ కామెడీ న‌టుడు చేసిన అనుచిత వ్యాఖ్య‌లు సోషియ‌ల్ మీడియాలో సంచ‌ల‌నంగా మారాయి.

తమిళ నాడుకు చెందిన మనోజ్ ప్రభాకర్ అనే స్టాండప్ కమెడియన్ రీసెంట్ గా మహేష్ బాబు పై ఫుల్లుగా జోకులు పేల్చాడు. ఈ మనొజ్ కు పెద్దగా పాపులరిటీ లేదు గానీ వాట్సాప్ లో మాత్రం కొన్ని ఇంగ్లీష్ లో జోక్స్ చెప్తున్న వీడియోస్ సర్కులేషన్ లో ఉన్నాయి. ప్రభాకర్‌ పబ్లిసిటీ కోసం మహేష్ బాబు నటన మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశార‌నే తెలుస్తోంది.

స్పైడర్‌ సినిమాలో మహేష్‌, ఎస్‌జే సూర్యల నటనను పోలుస్తూ ‘మహేష్ బాబు కు అసలు నటనే రాదు, ఆయనది రాక్‌ ఫేస్‌.. స్పైడర్‌ సినిమాలో ఎస్‌జే సూర్య అద్భుతంగా నటిస్తుంటే హీరో మహేష్ మాత్రం ఎక్స్‌ప్రెషన్‌ లేకుండా అలా చూస్తుండిపోయాడు’ అంటూ కామెంట్ చేశాడు. అంతేకాదు స్క్రీన్‌ మీద పెద్దరాళ్లను చూపిస్తూ మహేష్ బాబు ముఖాన్ని ఆ రాళ్లతో పోల్చి జోకులు పేల్చాడు.

దీంతో సూపర్‌ స్టార్ అభిమానులు మనోజ్‌ ప్రభాకర్‌పై ఫైర్‌ అవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా మనోజ్‌ ప్రభాకర్‌పై యుద్ధం ప్రకటించారు ఫ్యాన్స్. తప్పు తెలుసుకున్న మనోజ్‌ ఫేస్‌బుక్‌ ద్వారా సంజాయిషీ ఇచ్చుకునే ప్రయత్నం చేసినా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మనోజ్‌ ప్రతీ పోస్ట్‌పై వేల కామెంట్స్‌ చేస్తున్నారు మహేష్ ఫ్యాన్స్.

ఇక ఈ వీడియో చూసిన మహేష్ ఫ్యాన్స్ మనోజ్ పై ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే మనోజ్ ను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. కొంతమంది ఇప్పటికే బూతులు తిడుతున్నారు. క్లాస్ గా ఉన్న అభిమానులు కొంతమంది తమిళ స్టార్ హీరో విజయ్ ఎక్స్ ప్రెషన్స్ గురించి మనోజ్ ను ఒక సారి అలానే మాట్లాడమని సూచిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -