Sunday, May 5, 2024
- Advertisement -

ఆద‌ర్శ‌వంత‌మైన కోడ‌లు కావాలా..అయితే యూనివ‌ర్శిటీలో చేర్పించండి…

- Advertisement -

త‌మ‌ను బాగా చేసుకొనే ఆద‌ర్శ‌వంత‌మైన కోడ‌లు రావాల‌ని అత్త‌మామ‌లు కోరుకుంటారు. కొత్త కోడ‌లితో సంసారం సాఫీగా సాగిపోవాల‌ని కోరుకోవ‌డం స‌హ‌జం. ఆద‌ర్శ‌వంత‌మైన కోడ‌లు కావాల‌ని భావిస్తున్నారా …అలాంటి వారికోసం మధ్యప్రదేశ్‌లోని బర్కతుల్లా విశ్వవిద్యాలయం ‘ఆదర్శ్ బాహూ(ఆదర్శవంతమైన కోడలు)’ అనే కోర్సును కూడా తాజాగా ప్రవేశపెట్టబోతోంది. ఈ కోర్సు కొంత వింతగా అనిపిస్తున్న డిమాండ్ బాగానే ఉంద‌ని యూనివ‌ర్శిటీ అధికార‌లు అంటున్నారు.

మూడు నెలల వ్యవధితో కూడిన ఈ కోర్సు వచ్చే విద్యాసంవత్సరం నుంచి అందుబాటులో ఉండనున్నట్టు పేర్కొంది. అస‌లు ఈ కోర్షులో ఏమి నేర్పిస్తారంటే….పెళ్లయ్యాక భర్త పట్ల, అత్తామామల పట్ల బాధ్యతగా ఎలా ఉండాలి?, ఎలా నడుచుకోవాలి?.. లాంటి విషయాలు నేర్పిస్తారట. కాగా, మహిళా సాధికారతను పెంపొందించేందుకే ఈ కోర్సును ప్రవేశ పెడుతున్నట్లు వర్సిటీ యాజమాన్యం వెల్లడించింది. పెళ్లయ్యాక కొత్త జీవితం సాఫీగా సాగిపోయేందుకు ఈ కోర్సు సహాయపడుతుందని పేర్కొంది.

వివాహమైన తర్వాత అమ్మాయి జీవితంలో కొత్త దశ మొదలవుతుంది. అత్త గారింట్లో వాతావ‌ర‌ణానికి అల‌వాటు ప‌డాలంటే కొంత స‌మ‌యం ప‌డుతుంది. ఈ కోర్సులో సోషియాలజీ, సైకాలజీతో పాటు కుటుంబ విలువలు, బంధాల గురించి యువతులకు తెలియజేస్తాం. తొలి బ్యాచ్‌లో 30 మంది యువతులను ఈ కోర్సులో చేర్చుకుంటాం. దీని ద్వారా సమాజంలో మంచి మార్పు వస్తుందని ఆశిస్తున్నాం. కోర్సు పూర్తిచేసుకున్నాక తాము ఆదర్శ్‌ బాహు పేరిట సర్టిఫికేట్‌ను అందజేస్తామ’ని తెలిపారు.

అయితే ఈ కోర్షుపై సోషియ‌ల్ మీడియాలో నెటిజ‌న్లు వ్యంగాస్త్రాలు సందిస్తున్నారు. అబ్బాయిల కోసం కూడా ఆదర్శవంతమైన అల్లుడు అనే కోర్సు కూడా ప్రవేశపెడితే బాగుంటుందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -