Friday, March 29, 2024
- Advertisement -

కొత్త లుక్‌లో తమిళ్ స్టార్

- Advertisement -

తమిళ స్టార్‌ హీరో అజిత్‌ కుమార్ కొత్త లుక్‌లో అభిమానులను సర్‌ఫ్రైజ్ చేశారు. ఇటీవలే తన కుమారుడు అద్విక్‌ బర్త్‌డేను కుటుంబంతో కలిసి అజిత్‌ కుమార్ సెలబ్రెట్‌ చేసుకున్నారు. భార్య షాలిని, కూతురు అనౌష్క కుమార్, కొడుకు ఆద్విక్ కుమార్‌లతో రెస్టారెంట్‌కు వెళ్లిన అజిత్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలలో అజిత్ స్టైలిష్‌ లుక్‌లో అదరగొట్టారు. తెల్ల జుట్టు, తెల్ల గడ్డం, నల్ల కోటు, సూపర్ కళ్లద్దాలతో వారెవ్వా అనిపిస్తున్నారు. ఈ ఫొటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

అజిత్‌ కుమార్ స్టైలిష్‌ లుక్‌పై అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘సూపర్ లుక్’, ‘ఈ నయా లుక్ బాగుంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ స్టైలిష్‌ లుక్‌ తన తదుపరి చిత్రం కోసమే అని సమాచారం తెలుస్తోంది. అజిత్ తదుపరి చిత్రానికి తాత్కాలికంగా ‘AK61’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. AK61 పాత్ర కోసం అజిత్ ఏకంగా 25 కిలోల బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నాడని తెలుస్తోంది. ఇందుకోసం ట్రైనర్ల సమక్షంలో ఆయన కష్టపడుతున్నారట. ఈ నెలాఖరులో ఏకే కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం కానుందట.

అజిత్‌ కుమార్ ప్రస్తుతం ‘వలిమై’ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. హెచ్ వినోద్ దర్శకత్వంలో బాలీవుడ్ నిర్మాత బోని కపూర్‌ నిర్మించిన వలిమై.. ఫిబ్రవరి 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో విడుదలైన ఈ సినిమా రికార్డు వసూళ్లతో దూసుకుపోతోంది. ముఖ్యంగా తమిళనాడులో రికార్డు స్థాయిలో కలెక్షన్ల వర్షం కురుస్తోంది. విడుదలైన 3 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరింది. ఇప్పటి వరకు వలిమై సినిమా దాదాపుగా రూ. 140 కోట్ల వరకు వసూళ్లు చేసిందని సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -