హిందీ లో ‘శ్యామ్ సింగరాయ్ హీరో ఎవరంటే?

నేచురల్ స్టార్ నాని, సాయి పల్లవి జంటగా నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ మూవీ డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాను త్వరలో హిందీలో రీమేక్ చేయనున్నట్లు వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. ‘శ్యామ్ సింగరాయ్’ హిందీ రీమేక్ హక్కులను ఓ అగ్రనిర్మాణ సంస్థ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

హీరో పాత్రలో షాహిద్​ కపూర్ లేదా అజయ్​ దేవగణ్​ పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది. ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రానికి ‘టాక్సీవాలా’ ఫేమ్​ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో నాని డ్యూయల్ రోల్ లో నటించగా..సాయిపల్లవి దేవదాసి పాత్రలో ప్రేక్షకులను మెప్పించింది. కృతిశెట్టి మరో కీలకపాత్రలో నటించింది.

మిక్కీ జె మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. నాని ప్రస్తుతం ‘అంటే సుందరానికి’, ‘దసరా’ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. నాని జెర్సీ చిత్రం హిందీలో షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే.

నాగ శ్రీనుకు నాగబాబు సాయం

కేజీఎఫ్‌-2 నుంచి కొత్త అప్‌డేట్

మనసులో మాట బయటపెట్టిన సామ్

Related Articles

Most Populer

Recent Posts