Sunday, May 19, 2024
- Advertisement -

శ్రీరెడ్డికి మ‌ద్ద‌తుగా మాట్లాడిన తమ్మారెడ్డి

- Advertisement -

టాలీవుడ్ తాజా సంచ‌లన తార శ్రీరెడ్డి గురించి తెలుగు ఇండ‌స్ట్రీ పెద్ద తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడారు.నటి శ్రీరెడ్డితో కలిసి పని చేయొద్దని చెప్పే హక్కు ప్రజాస్వామ్యంలో ఎవరికీ లేదని ప్రముఖ దర్శక – నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.ఆ అమ్మాయి గొడవ మొదలుపెట్టినప్పటి నుంచి నేను చెబుతూనే ఉన్నాను, ఎవరో ఒకళ్లు పిలిచి మాట్లాడాలని కాని నా మాట‌ల‌ను ఎవ‌రు ప‌ట్టించుకొలేదు.ఆ అమ్మాయి లేవనెత్తిన సమస్య ఉందా? లేదా? ఒకవేళ ఉంటే ఎలా అరికట్టాలి? దానికి కొన్ని పరిష్కారాలు నేను చెప్పాను.

ఒక అమ్మాయి ఛాంబర్ ముందుకొచ్చి అర్ధనగ్న ప్రదర్శన చేసిందంటే..మనందరమూ సిగ్గుపడాల్సిన విషయం.శ్రీరెడ్డికి ‘మా’ మెంబర్ షిప్ ఇస్తారా? లేదా? అనేది వాళ్లిష్టమని, ఈ విషయమై ఎవరూ ప్రశ్నించేందుకు లేదని ప్రముఖ దర్శక – నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. ఫలానా వాళ్లతో కలిసి పనిచేయొద్దని చెప్పే హక్కు ప్రజాస్వామ్యంలో ఏ యూనియన్ కు, ఏ సంస్థకు ఉండదు. ఫండమెంటల్ రైట్ అది.మీరు వాళ్లతో పని చేస్తే సస్పెండ్ చేస్తామని చెప్పకూడదు.ఇప్ప‌డు ఈ స‌మ‌స్య నేష‌న‌ల్ లేవ‌ల్లోకి వెళ్లింది మ‌న చేత‌ల్లో ఏం లేద‌ని చెప్ప‌కొచ్చారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -