Thursday, March 28, 2024
- Advertisement -

తనీష్ ‘రంగు’ రివ్యూ

- Advertisement -

చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ఆరంభించిన నటుడు తనీష్ ఆ తరువాత హీరోగా కొన్ని సినిమాలలో నటించారు. ఒకటి అరా తప్పించి హీరోగా సరైన సక్సెస్ ని అందుకోలేకపోయాడు. ఇటీవల బిగ్ బాస్ 2 లో కంటెస్టెంట్ గా వెళ్లి, ఫైనల్స్ కి చేరుకొని కాస్త పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలని తను నటించిన ‘రంగు’ సినిమాను శుక్రవారం  ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. మరి ఈ సినిమాతోనైనా తనీష్ ని విజయం వరించిందో లేదో రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథ:
పవన్ కుమార్ అలియాస్ లారా(తనీష్) ఇంటర్ లో స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించి విజయవాడలో ఓ డిగ్రీ కాలేజ్ లో జాయిన్ అవుతాడు. స్వతహాగా కోప స్వభావం గల లారా కాలేజ్ లో సీనియర్లు ర్యాగింగ్ చేస్తుంటే ఎదురు తిరుగుతాడు. జూనియర్స్ అందరి ముందుండి నాయకుడిగా వ్యవహరిస్తుంటాడు. రెండు గ్రూపుల మధ్య గొడవలతో కాలేజ్ మొత్తం యుద్ధవాతావరణం నెలకొంటుంది.ఇంతలో పరీక్షలు దగ్గర పడడంతో రెండు గ్రూపులు రాజీ పడి గొడవలను పక్కన పెట్టేస్తారు. అయితే ఓ గొడవలో లారా అనుకోకుండా ఒక వ్యక్తిని చంపేస్తాడు. ఈ కేసులో జైలుకి వెళ్లిన అతడికి అక్కడ పరిచయమైన ఎం ఎల్ పి(పోసాని కృష్ణమురళి) అండతో బెయిల్ పై బయటకి వచ్చి చిన్న చిన్న సెటిల్మెంట్లు చేస్తూ రౌడీగా మారతాడు. లారాని ఇష్టపడిన పూర్ణ(ప్రియా సింగ్) అతడిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది.

ఇది ఇలా ఉండగా లారా స్నేహితుడు సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయిని ప్రేమించడంతో లారా వారిద్దరికీ పెళ్లి చేస్తాడు. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎస్ ఐ లంచం తీసుకొని లారా పై రౌడీ షీట్ ఓపెన్ చేస్తాడు. ఈ క్రమంలో పోలీసులకు లారాకి మధ్య ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి. లారాని ఎన్కౌంటర్ చేసి చంపేయాలని పోలీసులు ప్లాన్ చేస్తారు.

అక్కడ నుండి తప్పించుకున్న లారా.. పూర్ణ చూపిస్తున్న ప్రేమతో పూర్తిగా మారిపోయి ఆమెని పెళ్లి చేసుకొని ఓ బ్యాంక్ లో జాబ్ జాయిన్ అవుతాడు. సాఫీగా సాగిపోతున్న తన జీవితంలోకి మళ్లీ పాత గొడవలు వస్తాయి. శత్రువులు లారా ఉద్యోగం పోయేలా చేస్తారు. దీంతో లారా మళ్లీ రౌడీగా మారిపోతాడు. ఈ క్రమంలో అతడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు..? పోలీసులు, లారా శత్రువులు అతడిని మట్టుబెడతారా..? అనే విషయాలు తెరపై చూసి తెలుసుకోవాల్సిందే!

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -