Sunday, May 12, 2024
- Advertisement -

‘టాక్సీవాలా’ ప్రీ రిలీజ్ రివ్యూ

- Advertisement -

టాలీవుడ్ సన్సేష‌న్ హీరో విజ‌య్ దేవ‌ర‌కండ తాజాగా న‌టించిన సినిమా టాక్సీవాలా.ఎప్పుడో విడుద‌ల కావ‌ల్సిన ఈ సినిమా వాయిదాల వాయిదాలు ప‌డుతు మొత్త‌నికి ఈ రోజే విడుద‌ల అవుతుంది.విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన గ‌త సినిమా నోటా స‌రైన విజ‌యం సాధించ‌లేదు.దీంతో ఈ సినిమాపై అంచ‌నాలుభారీగానే ఉన్నాయి.హార్ర‌ర్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమా కోసం మొత్తం కొత్త టీమ్ ప‌ని చేశారు. ఇక విడుద‌ల‌కు ముందే సినిమా మొత్తం ఆన్‌లైన్‌లో ప్ర‌త్య‌క్షం అయింది.సినిమా ఎడిటింగ్ అవ‌కుండానే సినిమా విడుద‌ల కావడం చిత్ర యూనిట్‌ను క‌ల‌వ‌ర ప‌రిచింది.అయినప్ప‌టికి సినిమాలోని కంటెంట్ ఉందని న‌మ్ముతున్నారు చిత్ర ద‌ర్శక నిర్మాతలు.ఇక ఈ రోజు విడుద‌ల అయిన ఈ సినిమా ట్విట్ట‌ర్ రివ్యూ ఎలా ఉందో ఓసారి చూద్దాం.

డిగ్రీ పూర్తి చేసి కూడా ఖాళీగా తిరుగుతుంటాడు హీరో.ఏ ప‌ని చేయాలో తెలియాక మొద‌ట క్లాత్ షో రూమ్ ద‌గ్గ‌ర చెకింగ్ బాయ్‌గా ప‌ని చేస్తాడు.త‌రువాత త‌క్కువ ధ‌ర‌కే కారుని కొని ఆ కారు ద్వారా వ‌చ్చే డ‌బ్బుతో ఎంజాయ్ చెద్దామ‌నుక‌న్న హీరోకి షాక్ ఇస్తుంది ఆ కారు.ఆ కారులో ఏదో తెలియ‌ని మాయ ఉంటుంది.మొద‌ట అది దెయ్యంగా భావించిన‌ప్ప‌టికి త‌రువాత అది ఏంటో రివీల్ అవుతుంది.ఈ మ‌ధ్య‌లో జ‌రిగే క‌థ‌ను చాలా చ‌క్క‌గా తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు.త‌ను అనుకున్న క‌థ‌ను తెర మీద చూపించ‌డంలో ద‌ర్శకుడు విజ‌యం సాధించాడు.ఇక ఎప్ప‌టిలాగే విజ‌య్ దేవర‌కొండ త‌న న‌ట‌నతో ఆక‌ట్టుకున్నాడు.హీరోయిన్ ప్రియాంక అందంతో పాటు న‌ట‌న‌తో కూడా ఆక‌ట్టుకుంది.ఈ సినిమా ద్వారా తెలుగు తెర‌కు మ‌రో క‌మెడియ‌న్ దొరిక‌డ‌ని అంటున్నారు.

విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రెండ్‌గా ఓ కొత్త న‌టుడు ఈ సినిమాతో ప‌రిచియ‌మ‌వుతున్నాడు.ఈ సినిమాలో అత‌ను చేసిన న‌ట‌న‌కు థియోట‌ర్ల‌లో న‌వ్వులే న‌వ్వులు అని తెలుస్తుంది. సినిమా విడుద‌ల‌కు ముందే బ‌య‌టికి వ‌చ్చిన‌ప్ప‌టికి సినిమా అంద‌రికి న‌చ్చుతుంద‌ని భావిస్తుంది.చిత్ర యూనిట్‌.దుబాయ్‌,యూఎస్ నుంచి వ‌స్తున్న రిపోర్టుల ప్ర‌కారం విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు మరో హిట్ వ‌చ్చిన‌ట్లేన‌ని తెలుస్తుంది. పూర్తి రివ్యూ కోసం చూస్తునే ఉండండి ఆద్యా న్యూస్‌.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -