Tuesday, May 14, 2024
- Advertisement -

త్వరలో వర్మను గిల్లేవారి లిస్టు… ఇదిగో

- Advertisement -

లక్ష్మీస్ ఎన్టీఆర్ అనౌన్స్ చేసిన దగ్గరనుంచి వర్మను ఎవరో ఒకరు నిత్యం గిల్లుతూనే ఉన్నారు. మాట అంటేనే పడని వర్మ..గిల్లితే ఊరుకుంటాడా. చేయాల్సిన రచ్చంతా చేస్తున్నాడు. టీడీపీ నాయకులంతా రాముపై వన్ బై వన్ విరుచుకుపడుతుంటే… అందరికీ సమాధానం చెప్పేస్తున్నాడని ఇప్పుడు టీడీపి కి అంతగా సంబంధం లేదని అప్పట్లో ఎన్టీఆర్ ఫ్యామిలీతో కాస్త దగ్గరిగా మెలిగిన వారు లైమ్ లైట్లోకొచ్చి రాముపై ట్వీటుతున్నారు.

ఇలాంటి స్టేట్ మెంట్ లకు కూడా రాము లొంగకపోవడంతో.. ఇప్పుడు వారంతా దాడిపెంచడానికి సరైన అవకాశం కూసం ఎదురుచూస్తున్నారు. దానిలో భాగంగా తాజాగా రాము,బ్రదర్ అనీల్ ను విజయవాడ పార్క్ హయత్ హోటల్ లో కలవడాన్ని ఓ అవకాశంగా తీసుకున్నారు. ఏకంగా రామునే ఓపెన్ గా అవును నేను కలిసాను అని చెప్పేయడంతో ఇప్పుడు టీడీపి పార్టీ మాటల గారడీలు చేసే నాయకులను వర్మపైకి వదులుతుంది.

రాముపై ఎటాక్ చేసేవారి లిస్టులో బొండా ఉమా,గరికపాటి,గంటా శ్రీనివాస్ రావు,నిమ్మకాయల చిన్నరాజప్ప,సినిమా పరిశ్రమలోని కొందరు ఎన్టీఆర్ అభిమానులను తెరపైకి తీసుకురావాలని టీడీపి శ్రేణులు చూస్తున్నాయట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -