Monday, May 6, 2024
- Advertisement -

ఏంది చంద్రబాబు? ఏందిది? ఇలా అయితే ఎలా? ఏమైంది నీ అనుభవం?

- Advertisement -

బాలయ్య ఎంతటి ఉత్తమోత్తమ పండితుడో మీకు తెలుసా? రాజమౌళికి రాజధాని నిర్మాణాలను ఫైనల్ చేసే సామర్థ్యం ఉందన్న విషయం మీరు గుర్తించారా? ఇక రాఘవేంద్రరావు, బోయపాటి శ్రీను, వెంకటేష్, మహేష్ బాబు……. ఇలా వీళ్ళందరి గొప్పతనాన్ని మీరు ఎప్పుడైనా గుర్తించారా? కానీ మన చంద్రబాబు మాత్రం బ్రహ్మాండంగా గుర్తించాడు. ఇంకా పరుచూరి బ్రదర్స్, నారా రోహిత్…….అబ్బో చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద బ్యాచే ఉంది. వీళ్ళందరూ ఎంతో ఎంతెంతో గొప్పవాళ్ళన్నది చంద్రబాబు ఆలోచన. అందుకే ఐఎఎస్‌లు, ఐపీఎస్‌ల కంటే రాజమౌళి, బాలయ్య, బోయపాటి శ్రీనులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. ఇక నంది అవార్డులతో సహా అన్ని అవార్డులను ఈ బ్యాచ్ జనాలకే ఇస్తాడు.

మరి అలాంటి జనాలను చేవచచ్చిన వాళ్ళు, చవటలు అని టిడిపి నేత బాబూ రాజేంద్రప్రసాద్ విమర్శలు చేయడం ఏంటి? ఏంది చంద్రబాబు? ఏందిది? టిడిపి ఎంపి గల్లా జయేదేవ్‌కి సూపర్ స్టార్ మహేష్ బాబు స్వయానా బావ. ఇక బాలయ్యబాబుతో మీ సంబంధం గురించి అందరికీ తెలిసిన విషయమే. తండ్రికి వెన్నుపోటు పొడిచిన సందర్భంలో కూడా మీకు సపోర్ట్ ఇచ్చాడు. అఫ్కోర్స్……..ధర్మాధర్మాల గురించి తెరపైన, మీడియా ముందు బాలయ్య కొట్టినన్ని డైలాగులు ఇంకెవరూ కొట్టరనుకోండి. ఆ మాటకొస్తే అవినీతి చేస్తూ అడ్డంగా దొరికిపోయిన తర్వాత కూడా నిప్పు అని నువ్వు అస్తమానూ చెప్పుకుంటూ ఉండడంలా.

ఆ విషయం పక్కనపెడితే రాజమౌళి, రాఘవేంద్రరావు, బోయపాటి శ్రీను, బాలయ్య లాంటి ఉద్ధండులు, ఉత్తమోత్తములు అని సర్టిఫికెట్ ఇస్తూ ఉంటే నీ పార్టీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ మాత్రం వాళ్ళ:దరూ కూాడా చవటలు, చేవలేని దద్దమ్మలు అని విమర్శలు చేస్తాడేంటి? అదేంటంటే ప్రత్యేక హోదా గురించి మాట్లాడడం లేదంట. అయినా మనలో మన మాట……..నాలుగేళ్ళుగా అదే ప్రత్యేక హోదా గురించి నీకు మాత్రం మాట్లాడే ధైర్యం ఎక్కడేడ్చింది? ఏదో ఎన్నికల సంవత్సరం కాబట్టి……..మోడీ ఏమీ చేయడన్న ధైర్యం…….ఇప్పుడు కూడా మాట్లాడకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2019 ఎన్నికల్లో మరీ డిపాజిట్లు కూడా చే్స్తారన్న భయంతో ఇప్పుడు మీడియా ముందు షో చేస్తున్నావు కానీ అంతకుముందు హోదా పేరెత్తే ధైర్యం నీకు ఎక్కడుంది? అంటే మొన్న మొన్నటి వరకూ నువ్వు కూడా బాబు రాజేంద్రప్రసాద్ చెప్పిన వాళ్ళ లిస్టులో ఉన్నావా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జనాలు అలానే తీసుకుంటున్నారు బాబుగారు. టిడిపి నేతలకు నువ్వు కాస్త ట్రైనింగ్ ఇవ్వాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -