Tuesday, May 14, 2024
- Advertisement -

గ‌త్యంత‌రం లేక ఆప‌ని చేసిన ఫిరాయింపు ఎంపీలు….

- Advertisement -

కేంద్రంపై వైసీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానం ఫిరాయింపు ఎంపీల పాలిట శాపంగా మారింది. ఫిరాయించిన ముగ్గురు ఎంపిలు ఎస్పీవై రెడ్డి, బుట్టా రేణుక, కొత్తపల్లి గీతలకు పెద్ద సమస్య ఎదురైంది. టీడీపీలో వెల్ల‌డం వారి వ్య‌క్తిగ‌తం అయినా సాంకేతికంగా ఇప్ప‌టికీ వైసీపీ ఎంపీలే. కాబట్టి పై ముగ్గురు ఎంపిల విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నా స్పీకర్ వారిని వైసిపి ఎంపిలుగానే పరిగణిస్తున్నారు.

అవిశ్వాస తీర్మానం అంశం మొదలైన దగ్గర నుండి ఫిరాయింపుల్లో టెన్షన్ మొదలైంది. దాంతో ఏం చేయాలో దిక్కుతోచక చంద్రబాబునాయుడుతో మాట్లాడుతున్నారు. చివ‌రికి టీడీపీ కూడా అవిశ్వాసం పెట్ట‌డంతో వారి ప‌రిస్థితి పెన్నంమీద‌నుంచి పొయ్యిలో ప‌డింది.

వైసీపీ జారీచేసిన విప్‌కు వ్య‌తిరేకంగా ఫిరాయింపు ఎంపీలు ఓటు వేస్తే ఎక్క‌డ ఎంపీ ప‌ద‌వుల‌కు ఇబ్బంది వ‌స్తుందోన‌ని చివ‌ర‌కు వేరే గ‌త్యంత‌రం లేక వైసిపి ప్రవేశపెడుతున్న అవిశ్వాస తీర్మానానికి అనుగుణంగానే ఓటు వేయాలని డిసైడ్ అయ్యారు. .

ముందు జాగ్రత్తగానే స్పీకర్ కు అందచేయటానికి వైసిపి తన మద్దతుగా నిలబడే ఎంపిల సంతకాలు సేకరిస్తోంది. అందులో భాగంగానే పిరాయింపులు కూడా చేసేదేమి లేక సంతకాలు చేశారని సమాచారం. అయితే ఇదంతా అవిశ్వాస తీర్మానం స్పీకర్ ఆమోదం పొంది చర్చకు వచ్చి ఓటింగ్ దాకా వెళితేనే ఈ త‌తంగం జ‌రుగుతుంది. అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చ జ‌రుగుతుందా లేదా అన్న‌ది వేచి చూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -