Friday, May 3, 2024
- Advertisement -

తనని ప్రేమించమని కాంట్రాక్ట్ రాయించుకున్న కాజల్

- Advertisement -

హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం హిట్ కోసం పరితపిస్తుంది. తాను నటించిన క్వీన్ రీమేక్ ఇంకా విడుదల కాలేదు కానీ తాను ఎంతో ఇష్టం గా మళ్ళి దర్శకుడు తేజ సినిమా లో నటించిన చిత్రం సీత విడుదల కి మాత్రం ఈ భామ మంచి ఉత్సాహం గా ఎదురు చూస్తుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మరియు కాజల్ అగర్వాల్ ఇద్దరూ కలిసి నటించిన సినిమా సీత. తేజ దర్శకుడి గా వస్తున్న ఈ సినిమా కి సంబందించిన ప్రచార చిత్రం ఇటీవలే విడుదల అయింది.

తాజాగా ఈ సినిమా కథ గురించిన అనేక ఊహాగానాలు ప్రస్తుతం సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్నాయి. అందులో భాగం గా ఈ సినిమా కథ మంచి రసవత్తరం గా ఉండేలా ఉంది. ఇప్పటికి అయితే దీని మీద ఒక క్లారిటీ రాలేదు కానీ సినిమా లో మాత్రం కాజల్ ని ప్రేమించడానికి బెల్లంకొండ ఒక కాంట్రాక్ట్ సైన్ చేస్తాడట. దాని లో భాగంగా అనేక ప్రయత్నాలు చేసే హీరో మొత్తానికి కాజల్ ని ప్రేమలో దింపే సమయానికి వచ్చే కాన్ఫ్లిక్ట్ ఈ సినిమా కి హైలైట్ గా నిలుస్తుంది అని వార్తలు వస్తున్నాయి.

ఈ కాన్సెప్ట్ కొత్త కాన్సెప్ట్ కాకపోయినా తేజ ఎలా తెరకెక్కిస్తాడా అనేది ఆసక్తికరం గా మారనుంది. ఈ సినిమా 24 న విడుదల కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -