Thursday, May 16, 2024
- Advertisement -

ఇన్ఫోసిస్ ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ రద్దు చేసిన కేంద్ర‌హోంశాఖ‌

- Advertisement -

బెంగళూరు కేంద్రంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ ఇన్ఫోసిస్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ ఇన్ఫోసిస్ ఫౌండేషన్ కు కేంద్ర హోంశాఖ బిగ్ షాక్ ఇచ్చింది. ఫౌండేషన్ ఉన్న రిజిస్ట్రేషన్‌ను కేంద్ర హోంశాఖ ర‌ద్దు చేసింది. విదేశాల నుంచి సహాయం పొందే ఎన్జీవోలు విదేశీ విరాళాలు(రెగ్యులేషన్) చట్టం (ఎఫ్ సిఆర్ఏ) క్రింద నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

అటువంటి ఏవైనా విరాళాల లెక్కలను ప్రతి ఏడాది ఆర్థిక సంవత్సరం ముగిసిన తొమ్మిది నెలల్లోగా ప్రభుత్వానికి అందజేయాలి. విదేశీ నిధులకు సంబంధించి వార్షిక ఆదాయం, ఖర్చుల వివరాలను సమర్పించడంలో ఇన్ఫోసిస్ విఫలంకావడంతో పలుమార్లు మంత్రిత్వశాఖ షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది.ఆరేండ్ల నుంచి ఎన్నోసార్లు ఈ అంశంపై వివరాలు సమర్పించాలని గుర్తుచేసిన‌ప్ప‌టికీ స్పందించకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -