టాలీవుడ్ సన్సేషనల్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటించిన సినిమాలతో లైఫ్ లైన్లోకి వచ్చిన కమెడియన్స్ రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి. పెళ్లి చూపులు సినిమాతో ప్రియదర్శి ఫేమస్ కగా, అర్జున్ రెడ్డి సినిమాతో రాహుల్ రామకృష్ణ కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చాడు. వీరిద్దరు బాగా ఫేమస్ కావడంతో వీరికి సినిమాలలో బాగానే అవకాశాలు వచ్చాయి. తాజాగా వీరిద్దరు కలిసి ఓ సినిమాలో హీరోలుగా నటించారు. వీరిద్దరు కలిసి నటించిన సినిమా మిఠాయి. గత శుక్రవారం విడుదల అయిన ఈ సినిమా తీవ్ర నిరాశకు గురి చేసింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఫ్లాప్‌గా నిలవడంతో రాహుల్ రామకృష్ణ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.తన కామెడీ టైమింగ్‌తో అనతి కాలంలోనే ప్రేక్షకాదరణ పొందిన ఈ కమెడియన్ ట్విటర్ నుంచి వైదొలిగారు.ప్రశాంత్‌కుమార్ దర్శకత్వం వహించిన మిఠాయి సినిమాను డా. ప్రభాత్ కుమార్ నిర్మిచారు. సినిమాకు ఇలాంటి ఫలితం వస్తుందని ముందే అంచనా వేశాను. సినిమా పరాజయానికి నేనే క్షమాపణలు తెలుపుతున్నానని తన ట్విట్టర్‌లో తెలిపి తన ట్విట్టర్ అకౌంట్‌ను డీలిట్ చేశారు రాహుల్ రామకృష్ణ.అయితే తన అకౌంట్ తాత్కాలికంగా డి యాక్టివ్ వేట్ చేశారా? లేక శాశ్వతంగా డిలీట్ చేశారా? అనేది తెలియాల్సి ఉంది.
- Advertisement -
మిఠాయి’ ఫ్లాప్‌తో సంచలన నిర్ణయం తీసుకున్న కమెడియన్
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -