Monday, May 6, 2024
- Advertisement -

కొడుకు త‌ల్లిని ల‌వ‌ర్ అని… పొర‌బ‌డిన యూత్‌

- Advertisement -

సినీ ప‌రిశ్ర‌మ‌లో గ్లామ‌ర్ వ‌ల‌న వారి వ‌య‌సు శ‌రీరంపై క‌నిపించ‌దు. అందుకే అర‌వై ఏళ్లు అయినా ఇంకా యంగ్‌గా క‌నిపిస్తారు. వారి పిల్ల‌ల‌తో పోటీ ప‌డుతూ యంగ్‌గా క‌నిపిస్తుంటారు. పిల్ల‌లు, ఏజ్ బార్ సినీన‌టులు ప‌క్క‌ప‌క్క‌న క‌నిపిస్తే అక్కో.. చెల్లో.. బ్ర‌ద‌రో.. ఇంకా కొంద‌రు తెలియ‌నోళ్ల‌యితే బాయ‌ఫ్రెండ్‌, గ‌ర్ల్‌ఫ్రెండ్ అని కూడా అనుకుంటారు. ఇలాంటి అనుభ‌వ‌మే ఓ సీనియ‌ర్ న‌టికి ఎద‌రైంది. ఆ విష‌యాన్ని ఇటీవ‌ల ఓ మీడియా నిర్వ‌హించిన ఇంట‌ర్వ్యూలో పేర్కొంది.

సీనియ‌ర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సనా. ఆమె ఎన్నో సినిమాల్లో న‌టిస్తూ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్నారు. ఇటీవ‌ల ర‌వితేజ రాజాది గ్రేట్ సినిమాలో గున్న గున్నా మామిడి పాట‌కు స్టెప్పులేసి ఆక‌ట్టుకున్నారు. అయితే ఒక‌రోజు త‌న కుమారుడు అన్వ‌ర్ తీసుకొని సినిమాకు వెళ్లారంట‌. ఆ స‌మ‌యంలో త‌న కుమారుడి స్నేహితులు వ‌చ్చి నీ గర్ల్ ఫ్రెండ్‌ను త‌మ‌కు పరిచయం చేయవా.. అని అడిగేశారట. దీనికి ఆమె షాక్‌కు గుర‌య్యి న‌వ్వుకున్నాని చెప్పుకొచ్చారు.స‌నా నిన్నే పెళ్లాడతా సినిమాతో టాలీవుడ్‌కు ప‌రిచ‌యం అయ్యారు. ఓ షోకి యాంకర్‌గా ఉన్న ఆమెను దర్శకుడు కృష్ణవంశీ సినీ ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం చేశారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -