Friday, May 17, 2024
- Advertisement -

వెంగిస‌ర్కార్‌కి కౌంట‌ర్ ఇచ్చిన బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్ …

- Advertisement -

వెంగిస‌ర్కార్‌కి కౌంట‌ర్ ఇచ్చిన బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్ …

Dilip Vengsarkar’s bouncer: N. Srinivasan says Dilip Vengsarkar’s not sacked for picking Virat Kohli

Dilip Vengsarkar, N. Srinivasan, Virat Kohli, Former BCCI president , Badrinath

2008లో కోహ్లీని ఎంపిక‌చేయ‌డంతో నాప‌ద‌వి పోయింద‌ని మాజీ చీఫ్ సెలక్టర్ దిలీప్ వెంగ్‌ సర్కార్ చేసిన వ్యాఖ్య‌ల‌కు బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్ కౌంట‌ర్ ఇచ్చాడు. రెండు రోజుల క్రితం టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ దిలీప్ వెంగ్‌ సర్కార్ కోహ్లిని జట్టులోకి ఎంపిక చేయడం అప్పట్లో బీసీసీఐ కోశాధికారిగా ఉన్న శ్రీనివాసన్‌తో పాటు మహేంద్రసింగ్ ధోని, కోచ్ గ్యారీ కిరిస్టన్‌కి ఇష్టంలేదని.. వారు చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు, తమిళనాడుకి చెందిన బద్రీనాథ్‌ని జట్టులోకి తీసుకోవాలని పట్టుబట్టినట్లు చెప్పాడు. వారి ప్రతిపాదనని లెక్క చేయకుండా కోహ్లీకి
అవకాశమిచ్చినందుకు తనని చీఫ్ సెలక్టర్ పదవి నుంచి శ్రీనివాసన్ అప్పట్లో తప్పించాడని వెంగ్ సర్కార్ ఆరోపించాడు.

2008లో జరిగిపోయిన విషయాన్ని వెంగ్ సర్కార్ ఇప్పుడు ప్రస్తావించడం సంస్కారం కాద‌న్నారు. జట్టు ఎంపికలో నేను ఎప్పుడూ జోక్యం చేసుకోలేద‌ని, విరాట్ కోహ్లీని ఎంపిక చేయడం వల్లే అతని చీఫ్ సెలక్టర్ పదవి పోయిందనడంలో వాస్తవం లేద‌న్నారు. అప్పట్లో అతను ముంబయి క్రికెట్ సంఘం ఉపాధ్యక్షుడిగా వెళ్లేందుకు ఆసక్తి కనబర్చాడు. అందుకే అతడ్ని సెలక్షన్ కమిటీలోకి తీసుకోలేద‌న్నారు.

బద్రీనాథ్‌ని పక్కన పెట్టడం వల్లే పదవి పోయిందుంటున్నా..? శ్రీలంక పర్యటన కోసం విరాట్ కోహ్లితో పాటు బద్రీనాథ్‌ని కూడా సెలక్టర్లు ఎంపిక చేసిన విషయం ఇక్కడ వెంగ్ సర్కార్ మరిచిపోయినట్లున్నాడు’ అని శ్రీనివాసన్ ఘాటుగా స్పందించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -