- Advertisement -

అందులో బ‌న్నీ లాస్ట్ ..రాజ‌మౌళి ఫ‌స్ట్‌

- Advertisement -

అందులో బ‌న్నీ లాస్ట్ స్థానం సంపాదించుకున్నాడు.ఎందులో అనుకుంటున్నారా అదేనండీ ఫోర్బ్స్ జాబితాలో.ఒకప్పుడు ఫోర్బ్స్ జాబితా అంటే అది కేవలం బాలీవుడ్ స్టార్స్ కు మాత్రమే అన్నట్టు ఉండేది. బాలీవుడ్ జ‌నాల‌కు మ‌న తెలుగువాళ్లు ఏమాత్రం తీసిపోవ‌డంలేదు.అది సినిమా ప‌రంగా అయిన ఆదాయం ప‌రంగానైనా స‌రే బాలీవుడ్‌తో పోటి ప‌డుతున్నారు.

2017సంవత్సరానికి గాను అత్యధిక ఆదాయం ఆర్జించిన స్టార్స్ వివరాల్ని ఫోర్బ్స్ వెల్లడించింది. సౌత్ నుంచి ఈ లిస్ట్ లో అందరికంటే ముందున్నాడు రాజమౌళి. ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ టాప్-100లిస్ట్ లో ఏకంగా 15స్థానంలో నిలిచాడు రాజమౌళి. 2017లో ఈ దర్శకుడి ఆదాయాన్ని 55కోట్ల రూపాయలుగా చూపించింది ఫోర్బ్స్. ఇక రాజమౌళి తర్వాత సౌత్ నుంచి సెకెండ్ ప్లేస్ లో నిలిచిన వ్యక్తి ప్రభాస్. టాప్-100లిస్ట్ లో రూ.36.25 కోట్ల ఆదాయంతో 22వ ర్యాంక్ సాధించాడు ప్రభాస్.సౌత్ సెలబ్రిటీస్ లో లిస్ట్ లో అందరికంటే ఆఖరి స్థానంలో అల్లు అర్జున్ ఉన్నాడు. ఇతడి ర్యాంక్ 81. మహేష్ కు 37, పవన్ కు 69వ ర్యాంక్ లు వచ్చాయి.

  • రాజమౌళి – 15 వ స్థానం – ఆదాయం రూ. 55 కోట్లు
  • ప్రభాస్ – 22 వ స్థానం – ఆదాయం రూ. 36.25 కోట్లు .
  • రానా – 36 వ స్థానం – ఆదాయం రూ. 22 కోట్లు
  • మహేష్ – 37వ స్థానం – ఆదాయం రూ. 19.63 కోట్లు
  • పవన్ – 69వ స్థానం – ఆదాయం రూ. 11.33 కోట్లు
  • అల్లు అర్జున్ – 81 వ స్థానం – ఆదాయం రూ. 7. 74 కోట్లు

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -