Tuesday, April 23, 2024
- Advertisement -

సన్నీ లియోని తో టాలీవుడ్ స్టార్ కమెడియన్స్ ….

- Advertisement -

టాలీవుడ్ లో కన్నా ప్రస్తుతం బాలీవుడ్ లో హారర్ కామెడీ ల ట్రెండ్ బాగానే నడుస్తుంది. ఇప్పటికే పలు హారర్ కామెడీ సినిమాలు విడుదల కావడానికి సిద్ధమవుతున్నాయి. మరోవైపు తాజాగా మరొక హారర్ కామెడీ ఈ జాబితాలో చేరింది. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రం లో టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం మరియు సునీల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇద్దరూ కమెడియన్స్ ఈ సినిమాతో బాలీవుడ్లో అడుగు పెట్టనున్నారు.

ఈ సినిమాలో హాట్ బ్యూటీ సన్నీలియోన్ హీరోయిన్ గా నటిస్తోంది. మరోవైపు మందన కరిమి కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించబోతోంది. హారర్ కామెడీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకి ప్రసాద్ తాటినేనిదర్శకత్వం వహిస్తున్నారు. మహేందర్ దరివాల్ మరియు పరందీప్ సందు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా హిందీ లో మాత్రమే కాక తెలుగులో కూడా విడుదల కాబోతోంది. తెలుగులో స్టార్ కమెడియన్స్ గా పేరు తెచ్చుకున్న బ్రహ్మీ, సునీల్ హిందీలో మొదటి సినిమాతోనే హిట్ అందుకుంటారా లేదా వేచి చూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -